పిఎంఇండియా
సమాచారం, కమ్యూనికేషన్, మీడియా రంగాలలో భారతదేశం, ఇథియోపియాల మధ్య సహకారానికి ఉద్దేశించిన ఒప్పందంపైన సంతకాలు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
నానాటికీ పెరుగుతున్న సమాచార రంగం, కమ్యూనికేషన్ రంగం, మీడియా రంగాల శక్తిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికిగాను, తద్వారా సమాచార వ్యాప్తిని చేయడానికిగాను, ఇరు దేశాలకు చెందిన అణగారిన వర్గాలకు లబ్ధి చేకూరే అభివృద్ధి కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య పరస్పరం ఏర్పాటు చేసుకొనే కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రజలకు మధ్య బంధాల్ని బలోపేతం చేస్తుంది. సమాచారం, కమ్యూనికేషన్, మీడియా రంగాలలో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడానికి ఈ కార్యక్రమం మంచి అవకాశాన్ని కల్పిస్తుంది.
రేడియో, ప్రింట్ మీడియా, టెలివిజన్, సోషల్ మీడియా వంటి మాస్ మీడియా సాధనాల మధ్య సహకారాన్ని ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుంది. తద్వారా ఇరు దేశాల ప్రజలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు, ప్రజల్లో బాధ్యతాయుతమైన వాతావరణం పెంపొందుతుంది.
ఈ ఒప్పందం సంస్థాగత విధి విధానాలను కలిగివుంటుంది. వీటి ద్వారా ప్రాతినిధ్యాలను ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. రెండు దేశాల సిబ్బంది రాకపోకలు సాగిస్తుంది. తద్వారా ఇరు దేశాల సిబ్బంది అత్యుత్తమ విధానాల్ని అమలు చేయడం జరుగుతుంది. దాంతో సమానత్వం, అందరినీ కలుపుకుపోయే వాతావరణం ఏర్పడుతుంది.