Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త‌దేశం, బంగ్లాదేశ్ ల న‌డుమ భూభాగాల మార్పిడి ప‌ర్య‌వ‌సానంగా ప‌శ్చిమ బెంగాల్ లోని నియోజ‌క‌వ‌ర్గాల స‌రిహ‌ద్దుల పున‌ర్ నిర్ణ‌యానికి సంబంధించి 2002 డిలిమిటేష‌న్ యాక్ట్ కు, మ‌రియు 1950 ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌


2002 డిలిమిటేష‌న్ యాక్ట్ లోని ‌సెక్ష‌న్ 11ను, మ‌రియు 1950 ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం లోని ‌సెక్ష‌న్ 9 ని స‌వ‌రించే ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర మంత్రిమండ‌లి ఆమోద‌ముద్ర వేసింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర మంత్రివ‌ర్గ ఆమోదం ల‌భించ‌డంతో.. 51 బంగ్లాదేశీ ఎన్ క్లేవ్ లను, 111 భార‌త‌దేశ ఎన్ క్లేవ్ లను 2015 జులై 31 నాటి నుంచి అమ‌లులోకి వ‌చ్చేలా భార‌త‌దేశం, బంగ్లాదేశ్ లు ప‌ర‌స్ప‌రం మార్పిడి చేసుకున్న‌ ద‌రిమిలా ప‌శ్చిమ బెంగాల్ లోని కూచ్ బిహార్ లోని అ‌సెంబ్లీ, పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల‌ స‌రిహ‌ద్దులను ప‌రిమిత స్థాయిలో పున‌ర్ నిర్ణ‌యించ‌డం ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కు ఇక సాధ్యం అవుతుంది. 2015 రాజ్యాంగ చ‌ట్టం (వందో స‌వ‌ర‌ణ‌) కు అనుగుణంగా ఈ చ‌ర్య తీసుకున్నారు. అంతే కాకుండా ఇది ద ఎల‌క్ష‌న్ లాస్ (అమెండ్ మెంట్) బిల్లు, 2016 పేరుతో ఒక బిల్లును పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్ట‌డానికి మార్గాన్ని సుగ‌మం చేస్తుంది.

***