పిఎంఇండియా
వ్యవసాయం, సాంకేతిక విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం తదితర రంగాలలో పరస్పర ప్రయోజనాల కోసం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఎ) మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ బెలారూస్ (ఎన్ఎఎస్ బి) లు కుదుర్చుకొన్న శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం సంబంధ సహకారపూర్వక ఒప్పందాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారు.
బెలారూస్ అధ్యక్షులు శ్రీ అలెగ్జాండర్ లుకాశెన్కో భారతదేశంలో పర్యటించిన సందర్భంగా 2017 సెప్టెంబర్ 12వ తేదీన న్యూ ఢిల్లీ లో ఈ ఒప్పంద పత్రాలను ఇరు పక్షాలు ఇచ్చి పుచ్చుకోవడం జరిగింది.
ప్రపంచ స్థాయిలో పోటీ పడే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశం మరియు బెలారూస్ లలో గుర్తించడం, మదింపు చేయడం, అభివృద్ధి పరచడం, ఇంకా వాణిజ్య సరళిలో వినియోగించడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యాలు. పరిశోధన, సాంకేతికత బదలాయింపులు, నిపుణుల రాక పోకలు మరియు శాస్త్ర విజ్ఞాన పరమైన, ఇంకా ఆర్థికపరమైన ప్రయోజనాలకు దారితీసేటటు వంటి సంయుక్త కార్యశాలల నిర్వహణలో ఈ ఒప్పందం ఉభయ దేశాలలోని సంస్థలకు మద్దతిస్తుంది.
*****