Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త‌దేశం మరియు స్వాజిలాండ్ ల మ‌ధ్య వైద్యం మరియు ఆరోగ్యం రంగంలో స‌హ‌కారానికి సంబంధించినటువంటి ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


భార‌త‌దేశం మరియు స్వాజిలాండ్ ల మ‌ధ్య వైద్యం మరియు ఆరోగ్యం రంగంలో స‌హ‌కారానికి ఉద్దేశించిన ఒక అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద ప‌త్రానికి (ఎంఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఎమ్ఒయు పై 2018 ఏప్రిల్ 9వ తేదీన సంత‌కాలు అయ్యాయి.

ఈ ఎంఒయు ..
i) ఔష‌ధాలు మ‌రియు ఫార్మాస్యూటిక‌ల్ ప్రోడ‌క్ట్స్‌;
ii) మెడిక‌ల్ క‌న్ స్యూమ‌బుల్ ప్రోడ‌క్ట్స్;
ii) వైద్య సంబంధ ప‌రిశోధ‌న‌లు;
iv) వైద్య సంబంధ సామ‌గ్రి;
v) ప్ర‌జ‌ల ఆరోగ్యం;
vi) సాంక్రామిక వ్యాధుల నిఘా & నియంత్ర‌ణ;
vii) స్వాస్థ్య సంబంధిత ప‌ర్యాట‌కం, ఇంకా
viii) ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు ముడిప‌డిన‌టువంటి మ‌రే ఇత‌ర రంగంలోనైనా స‌హ‌కారానికి దోహ‌దం చేస్తుంది.

ఈ ఎమ్ఒయు యొక్క అమ‌లును ప‌ర్య‌వేక్షించ‌డానికి మ‌రియు స‌హ‌కారం తాలూకు వివ‌రాల‌ను మ‌రింత విస్త‌రించ‌డానికి ఒక వ‌ర్కింగ్ గ్రూపు ను ఏర్పాటు చేయ‌డం జరుగుతుంది.

 

***