Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త‌దేశానికి మ‌రియు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం కుదిరిన సంగతిని మంత్రివ‌ర్గం దృష్టి కి తీసుకురావ‌డ‌మైంది


భార‌త‌దేశానికి మ‌రియు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఒ)కు మధ్య సంతకాలైనటువంటి మెమొరాండ‌మ్ ఆఫ్ అగ్రిమెంట్ (ఎమ్ఒఎ) ను గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం దృష్టికి తీసుకు రావ‌డ‌మైంది. భారతదేశం లో కంట్రీ ఆఫీస్ మాధ్యమం ద్వారా కార్యకలాపాలు జరుపుతున్నటువంటి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆగ్నేయ-ఆసియా ప్రాంతీయ కార్యాలయం ఈ ఎమ్ఒఎ లో డబ్ల్యు హెచ్ ఒ కు ప్రాతినిధ్యం వహించింది. 2018 మార్చి నెల 13వ తేదీన న్యూ ఢిల్లీ లో ఈ అవగాహన పత్రంపైన సంత‌కాలు అయ్యాయి.

ఈ ద్వైపాక్షిక ఎమ్ఒఎ భార‌త‌దేశానికి మ‌రియు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కు మ‌ధ్య స‌హ‌కారాన్ని ప్రోత్స‌హిస్తుంది. దీని వల్ల భార‌త‌దేశం లోని ప్ర‌జ‌ల యొక్క సార్వజనిక స్వాస్థ్య స్థితిగ‌తుల‌ను మెరుగుప‌ర‌చ‌డంలో తోడ్పాటు లభించగలదు.