పిఎంఇండియా
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, నైపుణ్యాల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో టెక్నికల్ విభాగంలో గ్రూపు-ఏ సర్వీస్ ఏర్పాటుకు ఆమోదం తెల్పింది. ఇంతకు ముందు ఈ విభాగం ఉద్యోగ కల్పన, శిక్షణ డైరెక్టరేట్ జనరల్ గా కేంద్ర కార్మిక,ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖలో ఉండేది (ఎంఎస్డీ&ఈ). ప్రస్తుతం ఈ నూతన సర్వీస్ ను భారత నైపుణ్యాల అభివృధ్ధి సర్వీస్ (ఐఎస్ డీఎస్) గా వ్యవహరిస్తారు.
క్యాడర్ పునర్వవస్థీకరణలో భాగంగా ఎస్ఏజీ స్థాయిలో ఒక పోస్టును,జేఏజీ స్థాయిలో నాల్గు పోస్టులను,ఎస్టీఎస్ స్థాయిలో ఏడు పోస్టులను అదనంగా చేర్చారు. జేటీఎస్ స్థాయిలో 12 పోస్టులను తొలగించారు.
సంస్థ నిర్వహణ స్థాయి పెంచటానికి వీలుగా ఎస్టీఎస్ స్థాయి అధికారులకు ఎన్ఎఫ్ఎస్జీ సదుపాయాన్ని 15 శాతం మంది ఎస్డీపీఎస్ లకు కల్పించటానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.