Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భిన్నత్వమే భారత ప్రత్యేకత, ప్రతిష్ట, ఖ్యాతి, బలం

అపూర్వ భిన్నత్వమే భారతావని ప్రత్యేకత, ప్రతిష్ట, బలమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బ్రిటన్ ప్రధానమంత్రి శ్రీ డేవిడ్ కామెరాన్ సమక్షంలో వెంబ్లీ స్టేడియంలో సమావేశమైన అశేష బ్రిటిష్-భారత్ సమాజాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. సిక్కు సమాజం, భారత సూఫీ సంప్రదాయాలు పోషించిన ఘనమైన పాత్రను, భాగస్వామ్యాన్ని ప్రధాని శ్రీ మోదీ కొనియాడారు. లండన్లో సిక్కు సమాజ ప్రతినిధులతో అంతకుముందు జరిగిన తన భేటీని ప్రస్తావిస్తూ- వారి బాధను పంచుకున్నానన్నారు. వారి సమస్యలను అర్థం చేసుకున్నానని, వాటిని పరిష్కరించటానికి ప్రయత్నం చేస్తున్నానని హామీ ఇచ్చారు.

దాదాపు గంటకుపైగా సాగిన తన ప్రసంగంలో ప్రధాని శ్రీ మోదీ భవిష్యత్ భారత్పై తన దార్శనికతను వివరించారు. రాజస్థాన్లోని అల్వర్కు చెందిన ఇమ్రాన్ ఖాన్ విద్యకు సంబంధించి 50 యాప్లు తయారు చేసి అందరికీ ఉచితంగా పంచిపెట్టారని ప్రధాని గుర్తు చేశారు. అలాగే హర్యానాలోని ఓ సర్పంచ్ తానిచ్చిన బేటీ పడావో, బేటీ బచావో పిలుపునకు స్పందించి, ‘కూతురుతో సెల్ఫీ’ ప్రచారం మొదలెట్టారని, అది విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని ప్రధాని తెలియజేశారు. ‘భారత్ బంగారు భవిష్యత్పై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే నా భవిష్యత్ భారత్ 50 విద్య సంబంధ యాప్లను తయారు చేసి ఉచితంగా అందజేసిన ఇమ్రాన్ ఖాన్లది, బిడ్డతో సెల్ఫీలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేపట్టిన హర్యానా సర్పంచిలాంటివారిది. ఇలాంటి స్ఫూర్తి దాయక వ్యక్తులు భారత్లో లెక్కలేనంత మంది ఉన్నారు’ అని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తంజేశారు.

‘ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలు భారత్లో ఉన్నాయి. మచ్చుకు కాదు… భారీ జనాభాతోనే ఉన్నాయి’ అని శ్రీ మోదీ గుర్తు చేశారు. భారత సమాజం ఎక్కడికెళ్ళినా ఈ భిన్నత్వంలో ఏకత్వ విలువను వెంట తీసుకొని వెళుతుందని అంటూ, అందుకే వారంతా భారత్కు రాయబారులని శ్రీ మోదీ ప్రశంసించారు. ఇప్పటిదాకా భారత్లో తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రధాని వివరించారు. ముఖ్యంగా భారత ప్రజల జీవనాన్ని మార్చే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఇంధనం గురించి తెలిపారు. చౌకగా సౌర ఇంధన ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో అపారమైన సౌరశక్తిగల దేశాలన్నింటితో కలసి షసౌర బంధా ‘నికి భారత్ సారథ్యం వహించబోతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. టీవీ తెరలపైనా, పత్రికల పతాకశీర్షికలపైన కన్పించేకంటే కూడా భారతావని చాలా విశాలమైన దేశమని ప్రధాని అన్నారు.