పిఎంఇండియా
భూటాన్‌లో నిర్మితమవుతున్న 720 మెగావాట్ల మాంగదేఛూ జల విద్యుత్తు ప్రాజెక్ట్ (హెచ్ ఇ పి) నిర్మాణ వ్యయ అంచనాకు చేసిన సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సవరించిన వ్యయ అంచనా (ఆర్ సి ఇ) విలువ రూ.4,020.63 కోట్లు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగులు విద్యుత్ ను భారతదేశానికి సరఫరా చేయడం జరుగుతుంది. తద్వారా దేశంలో అందుబాటులోకి వచ్చే విద్యుత్ పెరుగుతుంది. సవరించిన వ్యయ అంచనా (ఆర్ సి ఇ) కు వెంటనే ఆమోదం లభించిన కారణంగా ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతాయి.
మాంగదేఛూ హెచ్ ఇ పి కోసం భారతదేశం, భూటాన్ ల మధ్య 2010 ఏప్రిల్ నెలలో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఆ సమయానికి ఆమోదిత వ్యయం రూ. 2,896.3 కోట్లు ( మార్చి 2008 ధరల స్థాయి ప్రకారం). ఇందులో భారతదేశం 30 శాతం నిధులను గ్రాంటుగాను, 70 శాతం నిధులను రుణం కింద ఇవ్వడం జరిగింది. రుణానికి సంబంధించిన సాంవత్సరిక వడ్డీ 10 శాతం. ఈ రుణాన్ని భూటాన్ సంవత్సరానికి రెండు చొప్పున 30 వాయిదాల్లో చెల్లించాలి. ఇప్పటికి ప్రాజెక్ట్ వ్యయ అంచనా పెంపుదల మొత్తం రూ.1,124.359 కోట్లు.
మార్చి 2008 నుంచి మార్చి 2014 వరకు గల ద్రవ్యోల్బణం, కాఫర్ డ్యామ్ పై భాగాన్నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికిగాను చేయబోయే కటాఫ్ గోడ నిర్మాణం, మారక ద్ర్యవ్యంలో వచ్చిన తేడాలు మొదలైన అంశాలు ఆర్ సి ఇ వ్యయం పెరిగిపోవడానికి కారణమయ్యాయి.
****