Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భోపాల్ విమానాశ్ర‌యం లో ఎఎఐ కు చెందిన, అతిక్రమ‌ణ కు లోనైనటువంటి 106.76 ఎక‌రాల మేర‌ భూమి ని మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాని కి వదులుకోవడం కోసం ఎఎఐ తెచ్చిన ప్ర‌తిపాద‌న కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


భోపాల్ లోని గాంధీ న‌గ‌ర్ లో గ‌ల ఏర్ పోర్ట్ స్ అథారిటి ఆఫ్ ఇండియా (ఎఎఐ)కు చెందిన, అతిక్రమ‌ణ కు లోనైనటువంటి 106.76 ఎక‌రాల మేర‌ భూమి ని మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వాని కి వదులుకొనేందుకు ఎఎఐ తెచ్చిన ప్ర‌తిపాద‌న కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది. ఈ భూమి మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ద్వారా ఇప్ప‌టికే ఇచ్చినటువంటి 96.56 ఎక‌రాల భూమి కి బ‌దులు గా ఉన్న‌టువంటిది. మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ద్వారా దాదాపు 10.20 ఎక‌రాల భూమి ని ఎఎఐ కి ఇవ్వడం జరుగుతుంది.

ప్ర‌యోజ‌నాలు:

ఎఎఐ యొక్క అతిక్ర‌మ‌ణ కు గురైనటువంటి 106.76 ఎక‌రాల భూమి కి బ‌దులు గా, ర‌మార‌మి 96.56 ఎక‌రాల భూమి ని ఇచ్చేందుకు మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అంగీక‌రించింది. ఈ భూమి భోపాల్ విమానాశ్ర‌యానికి ఇప్పుడు ఉన్న భూమి కి ఆనుకొని ఉంది. ఈ భూమి ని విమాన‌యాన ప్ర‌యోజ‌నాల కోసం ఎఎఐ ఉప‌యోగించుకొనేందుకు వీలు ఉంది. దీనితో ఎఎఐ యొక్క 106.76 ఎక‌రాల భూమి ని విముక్తం చేయ‌డం లో తోడ్పాటు లభించగ‌ల‌దు. ఈ భూమి ని మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం విభిన్న ప్రయోజనాలకు గాను ఈసరికే వినియోగించుకొంటోంది. ఈ ప్రయోజనాలలో ప్ర‌భుత్వ కార్యాల‌యాల స్థాప‌న, పౌరుల‌ కు సౌకర్యవంతంగా ఉండే సేవ‌ లు మరియు సింధీ వలస కుటుంబాల‌ కు పున‌రావాసం క‌ల్పన వంటివి భాగం గా ఉన్నాయి. ఇంతవరకు, ఈ భూమి కి బ‌దులు గా, రాష్ట్ర ప్ర‌భుత్వం విమాన‌యాన ప్ర‌యోజ‌నాల కోసం భోపాల్ విమానాశ్ర‌యాన్ని ఆనుకొని ఉన్న‌టువంటి 96.56 ఎక‌రాల భూమి ని ఎఎఐ కి స‌మ‌కూర్చేందుకు సమ్మతించింది. ఇది జరిగిన తరువాత, ఈ భూమి కి బ‌దులు గా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవ్వ‌జూపిన భూమి ని ఎఎఐ విమాన‌యాన సంబంధిత కార్య‌క‌లాపాల‌ కు వినియోగించుకొనే ఆస్కారం ఉంది. తత్ఫలితం గా ఈ ఆమోదం వల్ల ప్ర‌జ‌ల కు విశాల ప్ర‌యోజ‌నాలు చేకూరగలవు.

**