Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మత్స్య పరిశ్రమ లో సహకారం కోసం భారతదేశం, బంగ్లాదేశ్ ల మధ్య ఎమ్ ఒ యు


మత్స్య పరిశ్రమ, ఆక్వాకల్చర్ ఇంకా సంబంధిత రంగ కార్యకలాపాలలో ద్వైపాక్షిక సహకారం కోసం 2011 సెప్టెంబర్ లో భారతదేశం,బంగ్లాదే శ్ ల మధ్య సంతకాలు జరిగిన అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ ఒ యు) గురించి కేంద్ర మంత్రిమండలి ధృష్టికి తీసుకువచ్చారు. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

ఈ ఎమ్ ఒ యు భారతదేశం, బంగ్లాదేశ్ ల మధ్య స్నేహ సంబంధాలను పటిష్టం చేసింది. మత్స్య పరిశ్రమ, ఆక్వాకల్చర్ ఇంకా సంబంధిత రంగాలలో పరస్పర అంగీకారం కుదిరిన కార్యకలాపాలు, పద్దతుల ద్వారా ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందింపచేసుకోవటం జరిగింది.

ఎమ్ ఒ యు ను రద్దు చేసుకోవటానికి అవతలి పక్షం తన అభిమతాన్ని కనీసం ఆరు నెలలు ముందుగా లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వకపోయినట్లయితే గనక ఎమ్ ఒ యు అయిదేళ్ళ పాటు అమలులో ఉంటుంది. ఆ పైన కూడా ఎమ్ ఒ యు ను.. పరస్పర సమ్మతిపై.. పొడిగించుకొనేందుకు అవకాశం ఉంది.