పిఎంఇండియా
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించి శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమాసియాలో ప్రాంతీయ ఉద్రిక్తతలపైనా చర్చించారు.
మలేషియా అధ్యక్షుడు అన్వర్ ఇబ్రహీంతో మాట్లాడిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. రానున్న హరిరాయ ఐదిల్‌ఫిత్రి పండుగ సందర్భంగా ఆయనకూ, ఆ దేశ ప్రజలకూ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఆందోళనకర పరిస్థితులపై చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నట్టు ఈ సందర్భంగా వారిద్దరూ పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వీలైనంత త్వరగా శాంతినీ, స్థిరత్వాన్నీ పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ, మలేషియా ప్రధానమంత్రి ఇబ్రహీం స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘మిత్రుడు, మలేషియా ప్రధానమంత్రి ఇబ్రహీంతో మాట్లాడాను. రానున్న హరిరాయ ఐదిల్‌ఫిత్రి పండుగ సందర్భంగా ఆయనకూ, ఆ దేశ ప్రజలకూ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపాను.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఆందోళనకర పరిస్థితిపైనా మేం చర్చించాం. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించేందుకూ, అలాగే చర్చలు, దౌత్యం ద్వారా శాంతినీ, స్థిరత్వాన్నీ పునరుద్ధరించేందుకూ కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నాం.’’
***
Spoke with my friend, Prime Minister Anwar Ibrahim of Malaysia, and conveyed warm greetings to him and the people of Malaysia on the occasion of the upcoming festival of Hari Raya Aidilfitri.
— Narendra Modi (@narendramodi) March 19, 2026
We also discussed the deeply concerning situation in West Asia and reaffirmed our…