పిఎంఇండియా
మలేసియాలో యూరియా మరియు అమ్మోనియా తయారీ కర్మాగారాన్ని- ఆ కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే సరుకును భారతదేశానికి ఇవ్వడం మరియు/లేదా మలేసియాలో ఇప్పటికే మిగులుగా ఉన్న యూరియాను భారతదేశానికి పంపడం అనే ఏర్పాటుపై- అభివృద్ధిపరచడం కోసం మలేసియాతో ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు)పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2.1 బిలియన్ యుఎస్ డాలర్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు ప్రతి సంవత్సరం 2.4 మిలియన్ టన్నుల యూరియాను, 1.35 మిలియన్ టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి చేయగలదని భావిస్తున్నారు. ఈ ఉత్పత్తిని భారతదేశ విపణి కి సరఫరా చేస్తారు.
ఇరు పక్షాలు ఓ అంగీకారానికి వస్తే, దేశానికి అవసరమైన యూరియాను, అమ్మోనియాను తక్కువ ధరకు నిలకడగా సరఫరా చేయడం ఈ ఎమ్ఒయు పై సంతకాలతో వీలు పడుతుంది.