మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
మహర్షి వాల్మీకి ఆలోచనలు భారతీయ సంస్కృతికి, వారసత్వానికి మూలాధార తత్వాలుగా ఉంటూ, యుగయుగాల వరకు దేశాన్ని పోషించి, వర్ధిల్లజేస్తాయని ప్రధానమంత్రి అన్నారు. మానవ జాతికి మహర్షి ఇచ్చిన అమూల్య సందేశాలు దేశ పౌరులకు దారిదీపంగా నిలుస్తాయని కూడా ప్రధాని అన్నారు.
మహర్షి వాల్మీకి అపార కరుణను వివరించిన సంస్కృత సుభాషితాన్ని శ్రీ మోదీ ఈ రోజు ప్రస్తావించారు. మహర్షి కరుణరసంలో మొదట ఒక శ్లోకం పుట్టి, రామాయణానికి నాందీప్రస్తావన చేసిందని ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కొన్ని సందేశాలను ప్రధానమంత్రి పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా మీకందరికీ అనేకానేక శుభకామనలు. ఆయన సదాలోచనలు భారతీయ సంస్కృతికి, భారతీయ వారసత్వానికి మూల తత్త్వాలుగా ప్రకాశిస్తున్నాయి. అవి ప్రతి యుగంలోనూ దేశాన్ని పోషిస్తూ, దేశాన్ని వర్ధిల్లేటట్లుగా చేస్తుంటాయి. మహర్షి మానవ జాతికి అందించిన అమూల్య సందేశం దేశప్రజలకు అన్ని వేళలా మార్గదర్శనం చేస్తుంది.’’
‘‘తామభ్యగచ్ఛద్రుదితప్రవాదాత్కవిః కుశేధ్మాహరణాయ యాతః
నిషాదవిద్ధాండజదర్శనోత్థః శ్లోకత్వమాపద్యత యస్య శోకః.’’
పైన ప్రస్తావించిన శ్లోకానికి అర్థం ఇదీ..
మహర్షి వాల్మీకి కుశ అనే గడ్డిని, పవిత్ర దర్భలను సేకరించడానికి వెళ్లారు. అప్పుడు, ఒక ఆడ క్రౌంచ పక్షి దీనార్తరవాన్ని విన్నారు. దాంతో ఆయన హృదయంలో కరుణ, దయ పొంగిపొరలాయి. తత్క్షణం ఆయన నోటి వెంట ఒక శ్లోకం వెలువడింది. ఆ శ్లోకంతోనే రామాయణానికి అంకురార్పణ జరిగిది. ఆ శ్లోకం మహర్షిలో కరుణకు, సమ భావనకు, తపస్సుకు, జ్ఞానానికి అద్దం పట్టింది.
आप सभी को महर्षि वाल्मीकि जयंती की असीम शुभकामनाएं। उनके सद्विचार भारतीय संस्कृति और विरासत के मूल तत्व रहे हैं, जो हर युग में राष्ट्र को पुष्पित-पल्लवित करते रहेंगे। मानवता के लिए उनके अनमोल संदेश देशवासियों के लिए सदैव पथ-प्रदर्शक बने रहेंगे।
— Narendra Modi (@narendramodi) October 26, 2026
तामभ्यगच्छद्रुदितप्रवादात्कविः कुशेध्माहरणाय यातः। निषादविद्धाण्डजदर्शनोत्थः श्लोकत्वमापद्यत यस्य शोकः॥ https://t.co/5A5PP39t0Z
— Narendra Modi (@narendramodi) October 26, 2026