ఇటీవల ముగిసిన 2026 ఆసియా పారా క్రీడల్లో భారత పారా అథ్లెట్లు సాధించిన అసాధారణ విజయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.
రికార్డు స్థాయిలో 114 పతకాలు సాధించడం ద్వారా ఈ క్రీడల్లో భారత్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది యావత్ దేశానికి ఎంతో గర్వకారణమైన, ఆనందదాయకమైన సందర్భమని అన్నారు. అద్భుతమైన పట్టుదల, సంకల్పంతో రాణించిన భారత బృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ చారిత్రక విజయంలో ప్రతి క్రీడాకారుడి పాత్ర ఉందని, తమ విజయాలతో లెక్కలేనంత మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చారని ప్రధానమంత్రి ప్రశంసించారు.
“ఇటీవల ముగిసిన ఆసియా పారా క్రీడలు – 2026లో మన పారా అథ్లెట్లు సాధించిన విజయం అసాధారణమైనది! రికార్డు స్థాయిలో 114 పతకాలు సాధించడం ద్వారా ఈ క్రీడల్లో భారత్ అత్యుత్తమ రీతిలో చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. ఇది యావత్ దేశానికి ఎంతో గర్వకారణమైన, ఆనందదాయకమైన సందర్భం! అసాధారణమైన పట్టుదల, సంకల్పంతో రాణించిన మన భారత బృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ చారిత్రక విజయంలో ప్రతి క్రీడాకారుడూ భాగస్వామిగా నిలిచారు. తమ విజయాలతో లెక్కలేనంత మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చారు” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.
***
What an extraordinary achievement by our para-athletes at the just concluded Asian Para Games 2026! With a record 114 medals, this marks India’s best-ever performance at the Games. This is an occasion of immense pride and joy for the entire nation! I congratulate every member of our contingent for their exceptional determination. Each athlete has contributed to this historic achievement and inspired countless Indians with their accomplishments.
— Narendra Modi (@narendramodi) October 25, 2026