Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మహాత్మ గాంధీ ప్రవాసీ సురక్ష యోజన’ ముగింపునకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


‘మహాత్మ గాంధీ ప్రవాసీ సురక్ష యోజన’ను ముగించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉపాధి కోసం ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్ డ్ (ఇసిఆర్) దేశాలకు వెళ్లే కేటగిరీ శ్రామికులకు సంబంధించిన సాంఘిక భద్రతతో ముడిపడి ఉన్నఅంశాలను పరిష్కరించడం కోసం 2012 సంవత్సరంలో ‘మహాత్మ గాంధీ ప్రవాసీ సురక్ష యోజన’ (ఎమ్ జిపిఎస్ వై) ను ప్రారంభించారు.

ఎమ్ జిపిఎస్ వై లో చేరిన వారి సంఖ్య చాలా స్వల్పం. పైపెచ్చు, ఒక సంవత్సర కాలానికి పైగా ఎవ్వరూ ఇందులో చేరలేదు. కాబట్టి, ఈ పథకాన్ని మూసివేయడం వల్ల తత్సంబంధిత పునరావృత్త పాలన సంబంధ వ్యయంతో పాటు రికార్డులను భద్రపరచడానికయ్యే వ్యయాన్ని నివారించినట్లు అవుతుంది.

****