పిఎంఇండియా
మహాయోధుడు మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
వీరత్వానికి, పరాక్రమానికి మహారాణా ప్రతాప్ అమర ప్రతీకగా నిలిచారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మాతృభూమి గౌరవ మర్యాదలను, ప్రతిష్టను, ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.
మహారాణా ప్రతాప్ అజేయమైన ధైర్యం, చెక్కుచెదరని ఆత్మగౌరవ గాథలు యుగయుగాల వరకు దేశ ప్రజల హృదయాల్లో దేశభక్తి స్పూర్తిని నింపుతూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
“వీరత్వానికి, పరాక్రమానికి అమర చిహ్నం, దేశం గర్వించే గొప్ప యోధుడు మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఆయనకు ఇవే నా గౌరవపూర్వక నివాళులు. మాతృభూమి గౌరవ మర్యాదలను, ప్రతిష్టను కాపాడటం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన అజేయమైన ధైర్యం, చెక్కుచెదరని ఆత్మగౌరవ గాథలు యుగయుగాల వరకు దేశ ప్రజల హృదయాల్లో దేశభక్తి జ్వాలను రగిలిస్తూనే ఉంటాయి.’’
वीरता और पराक्रम के अमर प्रतीक, देश के महान योद्धा महाराणा प्रताप को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने मातृभूमि की आन-बान और शान की रक्षा के लिए अपना जीवन समर्पित कर दिया। उनके अदम्य साहस और अटूट स्वाभिमान की गाथाएं युगों-युगों तक देशवासियों के हृदय में राष्ट्रभक्ति का…
— Narendra Modi (@narendramodi) May 9, 2026