పిఎంఇండియా
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక కార్మాగారంలో జరిగిన పేలుడు ఘటనపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ. 2 లక్షల చొప్పున.. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున నష్ట పరిహారాన్ని అందజేయనున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక ప్రభుత్వం బాధితులకు అండగా ఉండి సహాయం అందిస్తోంది.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు.. గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందిస్తాం’’
***
The explosion at a factory in Nagpur, Maharashtra, is deeply distressing. My condolences to the families of the deceased. I pray for the speedy recovery of the injured. The local administration is assisting those affected.
— PMO India (@PMOIndia) March 1, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to…