Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాష్ట్ర, గుజరాత్ ల అవతరణ దినోత్సవం సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం సందర్బంగా ఆయా రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

”మహారాష్ట్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రాష్ట్ర ప్రజలకు ఇవే నా శుభాకాంక్షలు. మహారాష్ట్ర అభివృద్ధి పథంలో మరిన్ని నూతన శిఖరాలను అధిరోహించాలి అని కోరుకుంటున్నాను. జయ్ మహారాష్ట్ర” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

”గుజరాత్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు, గుజరాత్ పురోభివృద్ధి పథంలో పయనించాలని, భారతదేశ ప్రగతిలో తన వంతు పాత్రను పోషిస్తుండాలని నేను ఆశిస్తున్నాను” అంటూ ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.