Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాష్ట్ర లో గృహ‌ నిర్మాణ‌ం, ఇంకా పట్టణాభివృద్ధి ల వంటి ముఖ్య ప్రాజెక్టు ల ప్రారంభం సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగం

మహారాష్ట్ర లో గృహ‌ నిర్మాణ‌ం, ఇంకా పట్టణాభివృద్ధి ల వంటి ముఖ్య ప్రాజెక్టు ల ప్రారంభం సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగం


పెద్ద సంఖ్య లో ఇక్కడ గుమికూడిన నా సోదరులు మరియు నా సోదరీమణులారా,

ముంబయి, ఠాణే లు దేశంలో ఎటువంటి ప్రాంతాలంటే అవి ఈ దేశ ప్రజల కల లను నెరవేర్చడం లో తోడ్పాటు ను అందించాయి. చిన్న చిన్న గ్రామాల నుండి, నగరాల నుండి వచ్చిన చాలా మంది సామాన్యులు ఇక్కడ సుంసంపన్నత ను, సుప్రతిష్ఠ ను సాధించారు. ఇక్కడ జన్మించి, నివసిస్తున్న వారంతా ఎంతో ఉదార స్వభావులు, సహనశీలురు. ఇక్కడి ప్రజలు వారి హృదయం లో ప్రతి ఒక్కరి కి స్థానాన్ని కల్పించారు. అందుకే ఈ నగరాల లో యావద్భారతదేశం కేంద్రీకృతం అయివుంది. ఇక్కడ కు ఎవరు వచ్చినా ముంబయి లోని వర్ణరంజిత వాతావరణం లో భాగస్వాములై, మరాఠీ సంస్కృతి లో ఓ భాగం అయిపోతారు.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ రోజున ముంబై విపరీతంగా విస్తరిస్తూ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. అదే సమయంలో విలువైన వనరులపై వత్తిడి కూడా పెరుగుతోంది. ప్రధానంగా రవాణా వ్యవస్థ, రోడ్లు, రైల్వేలపై దాని ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఈ అంశాన్ని దృష్టి లో పెట్టుకొని గత నాలుగున్నర సంవత్సరాలలో ముంబయి, ఠాణే లు సహా సమీప ప్రాంతాలన్నింటిలో రవాణా వ్యవస్థ ను గణనీయం గా మెరుగుపరచేందుకు స్థిరం గా ప్రయత్నం జరుగుతోంది.
ఈ రోజు న 33 వేల కోట్ల రూపాయల వ్యయం కాగల ప్రాజెక్టు లకు శంకుస్థాపన జరిగింది. వాటి లో రెండు మెట్రో లైన్ ప్రాజక్టు లు కూడా ఉన్నాయి. అలాగే ఠాణే లో పేదల కోసం, మధ్యతరగతి వర్గాల కోసం 90,000 ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టు కు ఈ రోజు న శంకుస్థాపన జరిగింది.

మిత్రులారా,

ఏ నగరాభివృద్ధికైనా, దేశాభివృద్ధికైనా రవాణా అత్యంత కీలకం. త్వరితం గా పట్టణీకరణ జరుగుతున్న దేశాలలో భారతదేశం ఒకటి.

రానున్న కాలం లో త్వరితం గా అభివృద్ధి చెందుతున్న 10 అగ్రగామి నగరాలు భారతదేశం లోనే ఉంటాయని ఇటీవల జరిగిన ఒక అధ్యయనం లో తేలింది. నగరాల లో నివసిస్తున్న ప్రజలే ఈ త్వరిత పురోగతి కి అండ గా ఉంటున్నారు.

ఏ కాలం లో అయినా మన దేశం లో ఆర్థిక కార్యకలాపాల కేంద్రం గా ముంబయి నగరం నిలుస్తోంది. రానున్న కాలం లో ఈ నగరం మరింత గా విస్తరిస్తుంది. బిజెపి సారథ్యం లోని ఎన్ డిఎ ప్రభుత్వం కేంద్రం లో అధికారం లోకి వచ్చిన తరువాత ఈ నగరం లో మౌలిక వసతుల అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించింది అందుకే. ముంబయి స్థానిక రైళ్ల అభివృద్ధి కి కోట్ల రూపాయలను కేటాయించడమైంది. పాత రైల్వే వంతెనలన్నీ ఆధునీకరిస్తున్నారు. ముంబయి లోకల్ తో పాటుగా ఇతర రవాణా వ్యవస్థ లను విస్తరించడం జరుగుతోంది. వాటి లో ప్రధానమైంది మెట్రో రైల్ వ్యవస్థ. ఠాణే లో మెట్రో విస్తరణ జరిగిన తరువాత ముంబయి తో పాటు సమీపం లోని మరికొన్ని ప్రాంతాల కు కూడా మరింత మెరుగైన సంధానం ఏర్పడుతుంది.

మిత్రులారా,

ముంబయి మెట్రో తొలి ప్రాజెక్టు 2006వ సంవత్సరం లో వచ్చింది. కానీ ఎనిమిది సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు ఎక్కడ, ఎందుకు స్తంభించిపోయిందో ఎవరికీ తెలియదు. ఆ ప్రాజెక్టులో మొదటి లైను 2014 లో ప్రారంభమయింది. అది కూడా 11 కిలోమీటర్లే. 8 సంవత్సరాలలో కేవలం 11 కిలోమీటర్లా !

2014వ సంవత్సరం తరువాత మెట్రో లైన్ ల నిర్మాణం, విస్తరణ.. ఈ రెండింటి లో వేగం పెంచాలని నిర్ణయించాం. గత నాలుగు సంవత్సరాల కాలంలో ముంబయి మెట్రో నెట్ వర్క్ పలు కొత్త ప్రాజెక్టు లను చేపట్టింది. ఈ అంశాన్ని దృష్టి లో పెట్టుకొనే మరో రెండు మెట్రో లైన్ లకు ఈ రోజు న శంకుస్థాపన చేశాం. రానున్న మూడు సంవత్సరాల కాలం లో ప్రస్తుత మెట్రో నెట్ వర్క్ కు 35 కిలోమీటర్లు అదనం గా జత పడనుంది.
2022 మరియు 2024వ సంవత్సరాల మధ్య కాలం లో 275 కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్ ముంబయి వాసుల అందుబాటు లోకి రానుంది. ఈ రోజు న శంకుస్థాపన చేసిన ఈ మెట్రో ప్రాజెక్టు ఠాణే, భివండి, కల్యాణ్, దహిసార్, మీరా భయందర్ ల ప్రజలకు ప్రయోజనకారి కావడం ఒక్కటే కాక ముంబయి లో వాహనాల రాక పోక లు స్తంభించిపోయే పరిణామానికి కూడా కాలం చెల్లుతుంది.

మిత్రులారా,

నేటి అవసరాలే కాదు, 2035వ సంవత్సరం నాటి అవసరాలు కూడా పరిగణన లోకి తీసుకొని ఈ సదుపాయాల కల్పన జరుగుతోంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

మీ అందరి జీవితాలు మరింత మెరుగుపరచి మరింత సరళం చేయడమే కాదు, మధ్యతరగతి, పేద ప్రజలకు కూడా గృహవసతి కల్పించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.
2022వ సంవత్సరం లో భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకొనే సమయానికి దేశం లో ప్రతి ఒక్క కుటుంబాని కి సిమెంట్ పై కప్పు గల ఇల్లు ఉండాలన్న లక్ష్యం తో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. అందు లో భాగం గా ఈ రోజు న 90,000 ఇళ్ల నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టాం.

మిత్రులారా,

మా పని సంస్కృతి, వైఖరి, వేగం మూడు పాత ప్రభుత్వాల కన్నా చాలా భిన్నమైనవి. గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలం లో నిర్మించిన ఇళ్ల సంఖ్య 25.5 లక్షలే, అదే కాలం లో మా ప్రభుత్వం 1.25 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. అంటే ఇళ్ల సంఖ్య 5 రెట్లు పెరిగింది. పాత ప్రభుత్వం ఇదే పురోగతి ని సాధించాలంటే రెండు తరాలు పట్టేదన్న మాట.

ప్రధాన మంత్రి శహరీ ఆవాస్ యోజన లో భాగం గా మహారాష్ట్ర లో 8 లక్షల ఇళ్ల ను నిర్మిస్తున్నాం. ఇళ్లు లేని వారికి చక్కని, సామాజిక గృహాలను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా నిర్మించి ఇస్తున్నాం. ఇది గత ప్రభుత్వం హయాం లో విశేషం గా వార్తల లోకి వచ్చిన ఆదర్శ్ సొసైటీ కాదు. వాస్తవానికి సగటు పురుషులు, మహిళల కల లను సాకారం చేస్తూ వారి లో మెరుగైన భవిష్యత్తు పై, అభివృద్ధి పై ఆశ లను రేకెత్తించేదే ఆదర్శ సమాజం.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా మా ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల లో 2.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరు గా జమ చేస్తోంది. ఆ మొత్తాన్ని పేదలు, మధ్యతరగతి ప్రజలు తీసుకొనే ఇంటి రుణాల నుండి అప్పటికప్పుడే మినహాయిస్తారు. అలాగే గత కాలం తో పోల్చితే ఇంటి రుణాల పై వడ్డీ రేట్లు కూడా గణనీయం గా తగ్గించడం జరిగింది. ఈ పథకం లో భాగం గా ఆర్థికంగా బలహీనులైన వర్గాలకు, అల్పాదాయ వర్గాల వారి కి 6.5 శాతం వడ్డీ సబ్సిడీ ని కూడా అందిస్తున్నాం. మధ్యాదాయ వర్గాల కు 3 నుండి 4 శాతం వడ్డీ సబ్సిడీ ని ఇస్తున్నాం. అంటే ఎవరైనా 20 సంవత్సరాల కాలపరిమితి గల 20 లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నారంటే వారికి ప్రభుత్వం ద్వారా దాదాపు 6 లక్షల రూపాయల ఆర్థిక లబ్ధి ని చేకూరుతుందన్న మాట.

మిత్రులారా,

ప్రభుత్వం నిజాయతీ గా అందిస్తున్న ఈ సహాయం వల్ల గత ఏడాది, ఏడాదిన్నర కాలం లో లక్షల సంఖ్య లో ప్రజలు ఇళ్ల కు బుకింగ్ లు చేసుకున్నారు లేదా తొలి సారి గా ఇంటి ని కొనుగోలు చేశారు. గత సంవత్సరం తో పోల్చితే గత ఏడెనిమిది నెలల మధ్య కాలం లో కొత్త ఇళ్లను కొనుగోలు చేసిన వారి సంఖ్య రెట్టింపు అయినట్టు ఒక నివేదిక వెల్లడిస్తోంది. ఈ రోజు న ప్రారంభించిన ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టు కూడా అలాంటి ప్రజల కోసమేనని నా దృష్టి కి వచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా మహారాష్ట్ర లో 85 వేల మందికి పైగా 2,000 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక సహాయాన్ని అందుకొన్నారు.

మిత్రులారా,

మధ్యతరగతి కుటుంబాల కు ఇల్లు ఏర్పాటు చేయడమే కాదు, దానికి సంబంధించిన సమస్యల పైన కూడా మేం దృష్టి సారించాం. నాలుగు సంవత్సరాల క్రితం వరకు మీ జీవిత కాలం లో చేసిన పొదుపు అంతా పెట్టి ఫ్లాట్ ను బుక్ చేసుకోవాల్సి వచ్చేదని మీ అందరికీ తెలుసు. అలాగే కొందరు స్వప్రయోజనపరులు కల్పించే లిటిగేశన్ ల కారణం గా మీ ఇల్లు మీ చేతి కి అందేది కాదు. బుక్ చేసినప్పుడు చూపించింది ఒకటి, డెలివరీ ఇచ్చే సమయానికి అందించింది దానికి పూర్తిగా భిన్నమైంది అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మోసాన్ని అరికట్టేందుకు మా ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసింది. ఈ రోజు న దేశం లోని పలు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ డివెలప్ మెంట్ అథారిటీ (ఆర్ ఇఆర్ ఎ.. ‘రెరా’) ను నోటిఫై చేశారు. 21 రాష్ట్రాలలో ట్రైబ్యునల్ కూడా కార్యకలాపాలను ప్రారంభించింది.

రెరా అమలు పరచిన తొలి రాష్ట్రాలలో మహారాష్ట్ర కూడా ఒకటి. ఇందుకు నేను ఫడ్నవీస్ గారి ని అభినందిస్తున్నాను. దేశ వ్యాప్తం గా 35 వేల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, 27 వేల మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ లు రెరా లో భాగం గా నమోదయ్యారు. ఆ ప్రాజెక్టు లలో కూడా అధిక శాతం మహారాష్ట్ర లోనే ఉన్నాయి.

మిత్రులారా,

గత 70 సంవత్సరాల కాలంలో రియల్ ఎస్టేట్ రంగం ఏదైనా చట్టానికి లోబడి పని చేసిందా మీరే ఆలోచించండి. గత ప్రభుత్వాలు ఇటువంటి చట్టాలను చేసి ఉంటే ఇళ్ల కొనుగోలుదారులు వారి వివాదాల పరిష్కారం కోసం న్యాయస్థానాల చుట్టూ తిరగవలసి వచ్చేది కాదు. స్థిరాస్తి రంగం పారదర్శకత్వం తో వర్థిల్లి ఉండేది.

సోదరులు మరియు సోదరీమణులారా,

మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల ఎలక్ట్రిసిటీ బిల్లు లను తగ్గించేందుకు ప్రభుత్వం అవిశ్రాంతం గా కృషి చేస్తోంది. ఉజాలా పథకం లో భాగం గా దేశ మంతటా 30 కోట్ల ఎల్ ఇడి బల్బులను పంపిణీ చేశారు. వాటి లో 2.25 కోట్ల ఎల్ ఇడి బల్బు లు ఒక్క మహారాష్ట్ర లోనే పంపిణీ కాగా ఠాణే లో లక్షల బల్బుల పంపిణీ జరిగింది. దీని వల్ల కరెంటు బిల్లు గణనీయం గా తగ్గింది. ఈ పథకం సహాయం తో దేశ వ్యాప్తం గా సంవత్సరాని కి 16 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతోంది. అంటే ఒక్క మహారాష్ట్ర లోనే ఏడాది కి 1,100 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్లు ఆదా అవుతోందన్న మాట.

ఒక ఉద్యమ స్ఫూర్తి తో ఎల్ఇడి బల్బులను ప్రవేశపెట్టడంతో పాటు వాటి ఉత్పత్తి ని పెంచాలని కంపెనీ లను ప్రోత్సహించిన ఫలితమే ఇది. అంతే కాదు, బల్బులు ప్రజల కు అందడం లో మధ్య దళారుల ప్రమేయాన్ని అరికట్టడం వల్ల ఒక్కో ఎల్ఇడి బల్బు ధర 250- 300 రూపాయల నుండి ప్రస్తుతం 50 రూపాయల కు దిగి వచ్చింది.

మిత్రులారా,

కేంద్ర ప్రభుత్వం “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” సిద్ధాంతం తో ముందుకు పోతోంది.
దేశం లో ఏ ఒక్క గ్రామం, లేదా నగరం, లేదా ఏ ఒక్క వర్గం అభివృద్ధి కి దూరంగా ఉండకూడదన్నది దీని లక్ష్యం. ఇందులో భాగం గా పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ఎన్నో పథకాలను రూపొందించి అమలుపరచడం జరుగుతోంది.
ఉజ్వల పథకం లో భాగం గా దేశం అంతటా పేద కుటుంబాల్లోని సోదరీమణుల కు గ్యాస్ కనెక్షన్ లను ఉచితం గా అందించడం వల్ల వారు వంట చెరకు నుండి వచ్చే పొగ బారి నుండి విముక్తి ని పొందారు. వారి కి సమయం కూడా ఆదా అయింది. ఈ పథకం లో భాగం గా ఇంతవరకు దేశం లో 6 కోట్ల కనెక్షన్ లను ఇవ్వగా, వాటి లో ఠాణే తో సహా మహారాష్ట్ర లో 34 లక్షల మంది కి పైగా సోదరీమణులకు ఈ కనెక్షన్ లను అందించడమైంది.

మిత్రులారా,

సెలూన్, టైలరింగ్, నేత, హస్తకళలు వంటి భిన్న వృత్తులను చేపట్టి చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న సోదరీమణుల కోసం ఈ రోజు న బ్యాంకుల ద్వారాలు తెరచుకొని ఉన్నాయి.
ముద్ర యోజన లో భాగం గా 50 వేల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు రుణాన్ని ఎలాంటి పూచీకత్తు లేకుండా అందించడం జరుగుతోంది. మహారాష్ట్ర లో దాదాపుగా 1.25 కోట్ల రుణాలను అందించగా, వాటిలో ఒక కోటి రుణాలు మహిళల పేర్ల మీదనే ఉన్నాయి.

సోదరులు మరియు సోదరీమణులారా,

మహిళలు, పేదలు ఆత్మగౌరవం తో జీవించగల అవకాశాన్ని కల్పించడం మా లక్ష్యం.
అభివృద్ధి కి ఐదు విభాగాలు- బాలలందరి కి విద్య, యువతకు ఆదాయం, వయోవృద్ధులందరి కి ఔషధాలు, రైతు కు పంటనీటి వసతి, జనం గోడు వినడం- కీలకం గా మా ప్రభుత్వం అంకితభావం తో పని చేస్తోంది.
చివరగా అభివృద్ధి కి కొత్త ప్రాజెక్టు ప్రారంభమైన సందర్భం గా మీకందరికీ నా అభినందనలు. ఇంత భారీ సంఖ్య లో ఇక్కడకు వచ్చి నాకు ఆశీస్సు లను అందించినందుకు మీ అందరి కి ధన్యవాదాలు.

నేను ఇక్కడ నుండి పుణె కు వెళ్తున్నాను. అక్కడ కూడా వేలాది కోట్ల రూపాయల తో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టు లకు శంకుస్థాపన చేస్తాను. ఇంత భారీ సంఖ్య లో ఇక్కడ కు వచ్చి అమితమైన మీ బలాన్ని ప్రదర్శించిన అందరి కి ఇవే నా అభినందనలు.

అనేకానేక ధన్యవాదాలు.