Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహాలయ పర్వదిన సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


మహాలయ శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో సమాజంలో సంతోషం, కరుణ, ఆశాభావం వెల్లివిరియాలని ఆయన ప్రార్థించారు. అందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఇలా పేర్కొన్నారు.

“శుభో మహాలయ

దుర్గామాత ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులతో మన సమాజం సంతోషం, కరుణ, ఆశాభావంతో నిండిపోవాలి. అన్ని వైపులా శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలి’’.