పిఎంఇండియా
మహిళల స్కీట్ జట్టు విభాగంలో కాంస్య పతకం సాధించిన పరినాజ్ ధలీవాల్, మహేశ్వరి చౌహాన్, రైజా ధిల్లాన్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందించారు.
విజేతల ఏకాగ్రత, ఖచ్చితత్వం, సమష్టికృషి భారతీయ క్రీడారంగానికి మరో గర్వకారణమైన క్షణాన్ని అందించాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే పోటీల్లో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘మహిళల స్కీట్ జట్టు విభాగంలో కాంస్య పతకం సాధించిన పరినాజ్ ధలీవాల్, మహేశ్వరి చౌహాన్, రైజా ధిల్లాన్లకు అభినందనలు.
క్రీడాకారుల ఏకాగ్రత, ఖచ్చితత్వం, జట్టుకృషి భారతీయ క్రీడలకు మరొక గర్వకారణమైన క్షణాన్ని తెచ్చిపెట్టాయి. వారు భవిష్యత్తులో చేపట్టే ప్రయత్నాలకు శుభాకాంక్షలు: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’
***
Congratulations to Parinaaz Dhaliwal, Maheshwari Chauhan and Raiza Dhillon on winning the Bronze Medal in the Women’s Skeet Team event.
— PMO India (@PMOIndia) September 23, 2026
Their focus, precision and teamwork have brought another proud moment for Indian sports. Best wishes to them for their upcoming endeavours: PM…