పిఎంఇండియా
మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఒక క్లిష్టమైన కాలంలో భారత ప్రగతికి పీవీ నరసింహారావు గారు చేసిన కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. దేశ చరిత్రలోనే ఎంతో కీలకమైన దశలో భారతదేశ పురోగతికి ఆయన అత్యంత కీలకమైన సహకారాన్ని అందించారు. సమర్థుడైన పరిపాలకుడిగా ఆయన తనదైన ముద్ర వేశారు. భారత భిన్న సంస్కృతిపై అపారమైన జ్ఞానం, అవగాహన కలిగిన ఆయన ఒక గొప్ప విద్యావేత్తగా, మేధావిగా రాణించారు.”
***
Tributes to former Prime Minister Shri PV Narasimha Rao Ji on his birth anniversary. He made enduring contributions to India’s progress during a critical phase of our nation’s history. He made a mark as an able administrator. He was also a distinguished scholar, blessed with…
— Narendra Modi (@narendramodi) June 28, 2026