పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈరోజు, మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ పథకం (ఇసిహెచ్ఎస్) కింద, రెండో ప్రపంచ యుద్ధ వీరులు, షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్లు (ఎస్.ఎస్.సి.ఒ.ఎస్), ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్న వారికి వైద్య సదుపాయాలను ఆమోదించింది.
దీని ఫలితంగా, ఇప్పటివరకు ఇసిహెచ్ఎస్ పథకం కింద ప్రయోజనాలు పొందలేక పోయిన 43,000 మందికి ప్రయోజనం కలుగుతుంది.
దీని కింద కొన్ని షరతులుకు లోబడి దేశ వ్యాప్తంగా గల ప్రభుత్వ ఆస్పత్రులు, 2500 నమోదిత ప్రైవేటు ఆస్పత్రులు, 425 ఇసిహెచ్ఎస్ పాలిక్లినిక్‌లలో నగదు రహిత వైద్య సేవలు పొందడానికి వీలు కలుగుతుంది.
ప్రత్యేక చర్యగా , యుద్ధవీరుల భార్యల విషయంలో ఇసిహెచ్ఎస్‌లో చేరడానికి ఒక సారి చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు.
2003 ఏప్రిల్‌లో ఎన్.డి.ఎ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద 54 లక్షల మంది పెన్షనర్లు, వారి పై ఆధారపడిన వారు మరి కొందరు ఇతర కేటగిరీలలోని వారికి ఇసిహెచ్ఎస్ నాణ్యమైన వైద్యసదుపాయాన్ని అందిస్తున్నది.
మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి చర్యలు:
దేశం కోసం అసమాన త్యాగాలు చేసిన మన వీర మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి అధికారం చేపట్టిన తొలినాటి నుంచి ప్రభుత్వం తీసుకుంటూ వస్తున్నచర్యలలోకేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్న చర్య మరో చరిత్రాత్మక నిర్ణయం గా చెప్పుకోవచ్చు.
నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మాజీ సైనికోద్యోగుల ఒక ర్యాంకు, ఒకే పెన్షన్ డిమాండ్‌ను అమలు చేయడం ద్వారా, ఈ పథకం కింద 20 లక్షల మంది మాజీ సైనికోద్యోగులు 35 వేల కోట్ల రూపాయలకు పైబడి అందుకుంటున్నారు. మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ కార్యక్రమాలలో 40 శాతం పెన్షన్ పెంపు, ముందస్తుగా రిటైర్ అయిన వారికి డిజబిలిటి పెన్షన్, వాస్తవాధీన రేఖ (ఎల్.ఎ.సి), అధీనరేఖ ( ఎల్.ఒ.సి), ఇతర అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలలో యుద్ధక్షేత్ర మరణ ప్రయోజనాల వర్తింపు, సైనికుల అసమాన త్యాగాలకు కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్మీ బాటిల్ కాజువాలిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం, ఎక్స్ గ్రేషియా అడ్‌హాక్ అల
అలవెన్సు పెంపు, మాజీ సెయిలర్లకు స్పెషల్ పెన్షన్, ఇప్పటివరకు, 30 వేల మంది పదవీ విరమణ చేస్తున్నసైనికులకు
36 ఉద్యోగాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం వంటివి ఉన్నాయి.