Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మానవ జీవితంలో వాక్ నియంత్రణ, మనఃస్థిమితం, నిష్ఠ, నిస్వార్థం, నిజాయతీలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలనే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి


ఆచి తూచి మాట్లాడే, బుద్ధిని అదుపులో ఉంచుకొనే, చక్కని నడవడికను కలిగివుండే, శ్రద్ధను వీడనటువంటి వ్యక్తులు, ఆడంబరాలకు ఆమడ దూరంలో ఉండే వారు, త్యాగ గుణాన్ని అలవరుచుకొనే వారు, నిజాయతీపరులు.. ఇలాంటి వారందరు జీవితంలో అన్నింటిని సంపాదించుకోగలుగుతారని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ,
‘‘యస్య వాజ్ఞ‌్మనసీ స్యాతాం సమ్యక్ ప్రణిహితే సదా
తపస్త్యాగశ్చ సత్యం చ స వై సర్వమవాప్నుయాత్’’ అని పేర్కొన్నారు.
పైన చెప్పిన సూక్తికి భావం ఇదీ..
ఏ వ్యక్తుల మాటల తీరు, మనసు ఎల్ల వేళల సరి అయిన విధంగా ఉంటూ, ఏకాగ్రతను పాటిస్తాయో; ఎవరి జీవితంలో తపస్సు, త్యాగం, సత్య నిష్ఠ నిండుగా ఉంటాయో వారు జీవితంలో అత్యున్నత ప్రయోజనాలన్నిటిని తప్పక అందుకోగలుగుతారు.

***