Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మానసిక ఆరోగ్యం ముఖ్యమని చెప్పే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


మానసిక ఆరోగ్యంతోనే వందశాతం ఆరోగ్యంగా ఉండటం సాధ్యం అవుతుందని మానసిక ఆరోగ్య దినోత్సవం మనకు సందేశమిస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

పరుగులాంటి నేటి జీవన విధానంలో– ఆత్మావలోకనానికీఇతరుల పట్ల దయ చూపడానికీ ఎంతో ప్రాధాన్యం ఉందన్న సంగతిని ఈ దినోత్సవం గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి అన్నారుమానసిక ఆరోగ్యంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందనిప్రజలు ఈ దిశగా గట్టి ప్రయత్నం చేయాలనీ ఆయన సూచించారు.
మానసిక రోగులు కోలుకోవడానికీఆనందంగా ఉండటానికీ మానసిక చికిత్సాలయాల్లో పని చేస్తున్న అందరినీ ఆయన అభినందించారు.

ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని ఇలా పొందుపరిచారు:

‘‘మానసిక ఆరోగ్యంతో వందశాతం ఆరోగ్యంగా ఉండటం సాధ్యం అవుతుందని మానసిక ఆరోగ్య దినోత్సవం మనకు సందేశమిస్తోందినేటి ఉరుకులు పరుగుల జీవన విధానంలో– ఆత్మావలోకనానికీఇతరుల పట్ల దయ చూపడానికీ ఎంతో ప్రాధాన్యం ఉందన్న సంగతిని ఈ దినోత్సవం మనకు గుర్తు చేస్తుందిమానసిక ఆరోగ్యంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందనిప్రజలు ఈ దిశగా గట్టి ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానుమానసిక రోగులు కోలుకోవడానికీఆనందంగా ఉండటానికీ మానసిక చికిత్సాలయాల్లో పని చేస్తున్న అందరినీ అభినందిస్తున్నాను’’.

 

***