Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాన‌వ‌హ‌క్కుల (స‌వ‌ర‌ణ‌) బిల్లు 2018కి కేంద్ర కేబినెట్ ఆమోదం


 

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర కేబినెట్ స‌మావేశం, దేశంలో మాన‌వ‌హ‌క్కుల మెరుగైన‌ ర‌క్ష‌ణ‌, ప్రోత్సాహానికి సంబంధించి మాన‌వ‌హ‌క్కుల (స‌వ‌ర‌ణ‌)బిల్లు 2018కు ఆమోదం తెలిపింది.
ముఖ్యాంశాలు…

బాల‌ల హ‌క్కుల ర‌క్ష‌ణ జాతీయ క‌మిష‌న్‌ను , మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ డీమ్డ్ మెంబ‌ర్‌గా చేర్చేందుకు ఈ బిల్లు ప్ర‌తిపాదిస్తున్న‌ది.
క‌మిష‌న్ కూర్పులో ఒక మ‌హిళా స‌భ్యురాలిని చేర్చే విధంగా ఇది ప్రతిపాదిస్తున్న‌ది.
జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌, అలాగే రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ ఎంపిక ప‌రిధిని, అర్హ‌త‌ల ప‌రిధిని విస్తృతం చేయ‌డానికి ప్ర‌తిపాదింప‌బ‌డింది. అలాగే
కేంద్ర పాలిత ప్రాంతాల‌లో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న కేసుల‌ను ప‌రిశీలించే యంత్రాంగాన్ని చేర్చేందుకు ఇది ప్ర‌తిపాదిస్తున్న‌ది.
జాతీయ మాన‌వ‌హ‌క్కుల క‌మిషన్‌, రాష్ట్ర మాన‌వ హక్కుల క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్‌, స‌భ్యుల ప‌ద‌వీ కాలాన్ని ఇతర కమిషన్ల ఛైర్పర్సన్ , సభ్యుల కు వ‌ర్తించే నిబంధనలతో సమానంగా చేయడానికి సవరించాలని ప్రతిపాదిస్తోంది.
ప్ర‌యోజ‌నాలు….
ఈ స‌వ‌ర‌ణ‌లు భార‌త‌దేశంలో మాన‌వ‌హ‌క్కుల వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌నున్నాయి. అలాగే అవి త‌మ పాత్ర‌ను , బాధ్య‌త‌ల‌ను మ‌రింత మెరుగుగా నిర్వ‌హించ‌డానికి వీలు క‌లుగుతుంది. అంతేకాకుండా స‌వ‌రించిన చ‌ట్టం అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలు, నిర్దేసిత సూత్రాల‌కు అనుగుణంగా ప్ర‌జ‌ల జీవితం, స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం, గౌర‌వానికి సంబంధించి దేశంలో వ్య‌క్తుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు అండ‌గా నిల‌వ‌డానికి ఉప‌క‌రిస్తుంది.
నేప‌థ్యం….

మాన‌వ‌హ‌క్కుల చ‌ట్టం 1993 కు తీసుకువ‌చ్చే స‌వ‌ర‌ణ‌లు జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌య‌(ఎన్‌.హెచ్‌.ఆర్‌.సి), రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎస్‌.హెచ్‌.ఆర్‌జి)ల‌ను పారిస్ సూత్రాల‌కు అనుగుణంగా మాన‌వ హ‌క్కుల ర‌క్ష‌ణ‌, ప్రోత్సాహం, స్వ‌యంప్ర‌తిప‌త్తి, స్వ‌తంత్ర‌త‌, బ‌హుళ‌త్వం, విస్తృత కార్య‌క‌లాపాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది.