పిఎంఇండియా
మాస్ మీడియా రంగంలో భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య సహకారానికి ఉద్దేశించిన అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఎమ్ఒయు ప్రధానాంశాలు:
రెండు దేశాలు ప్రధానంగా ఈ కింద తెలిపిన రంగాలలో సహకరించుకుంటాయి:
i. మాస్ మీడియా మరియు ప్రజా సంబంధాల రంగంలో సిబ్బంది శిక్షణకు రెండు దేశాలు వీలు కల్పిస్తాయి. అలాగే, సిబ్బంది అధ్యయన యాత్రలకు కూడా అవకాశం కల్పిస్తాయి;
ii. మాస్ మీడియా రంగంలో నిపుణులైన వారు ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఈ దేశం నుంచి ఆ దేశానికి వచ్చి వెళ్ళేందుకు ప్రోత్సాహం కల్పించడం;
iii. మాస్ మీడియా & కమ్యూనికేషన్ రంగంలో విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలు, పరిశోధన సంస్థల మధ్య సహకారానికి ప్రోత్సాహం. అలాగే, ఈ సంస్థల ప్రచురణలను పరస్పరం మార్పిడి చేసుకోవడానికి కూడా అవకాశాలు.
iv. మాస్ మీడియా కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనల అమలులోను, అలాగే మాస్ మీడియాకు సంబంధించిన గణాంక సమాచారం మార్పిడిలోను అనుభవాలను పంచుకుంటాయి. నిబంధనల విషయంలో పరస్పరం సహకారాన్ని అందజేసుకొంటాయి.
v. గుర్తింపు పొందిన మాస్ మీడియా రిప్రజెంటేటివ్ లు కార్యాలయాలను ప్రారంభించేందుకు అనుమతిస్తాయి. ఇచ్చి పుచ్చుకునే ప్రాతిపదికన వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన సిబ్బంది విధులను నిర్వహించడానికి తగిన పరిస్థితులను ఏర్పరచడం కోసం దీని ఉద్దేశం.