Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మీ రాక కోసం భారతదేశం ఎదురు చూస్తోంది’ అని యుఎస్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ కు తెలిపిన ప్రధాన మంత్రి శ్రీ మోదీ


యుఎస్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ భారతదేశం లో రెండు రోజుల ఆధికారిక సందర్శన కు తరలిరానుండగా ‘‘ఆయన రాక కోసం భారతదేశం వేచి ఉంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. (‘‘India Awaits Your Arrival @POTUS realDonaldTrump’’)

ఈ మేరకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ట్విటర్ లోని తన ఖాతా లో ఒక సందేశాన్ని పొందుపరచారు. ‘‘మీ సందర్శన మన దేశ ప్రజల మధ్య గల మైత్రి ని తప్పక మరింత గా బలోపేతం చేయగలదు. త్వరలో మీతో అహమదాబాద్ లో భేటీ అవుతాను’’ అని కూడా ఆయన పేర్కొన్నారు

అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు న అహమదాబాద్ కు చేరుకోనున్నారు. అక్కడ ఆయన మోటేరా స్టేడియమ్ లో ఏర్పాటయిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాని కి హాజరు కానున్నారు. అలాగే, సాబర్ మతీ ఆశ్రమాన్ని కూడా ఆయన సందర్శిస్తారు.

ఆ తరువాత, సాయంత్రం పూట ఆయన న్యూ ఢిల్లీ కి చేరుకోనున్నారు. వివిధ జాతీయ అంశాల పై మరియు అంతర్జాతీయ అంశాల పై ప్రధాన మంత్రి తో ఆయన విస్తృత స్థాయి చర్చ లు జరిపే అవకాశం ఉంది.