పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో పాల్గొని, ప్రసంగించారు. న్యాయ వ్యవస్థపై సామాన్య మానవుడికి పూర్తి నమ్మకం ఉన్న సంగతిని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
భారతదేశం లోని వేరు వేరు న్యాయస్థానాలలో పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉన్నట్లు చెప్పిన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ప్రసంగాన్ని ప్రధాన మంత్రి ఉటంకిస్తూ.. ప్రధాన న్యాయమూర్తి ఆవేదనను తాను అర్థం చేసుకున్నానన్నారు. ఈ తరహా సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ముందు ముందు కలసి పని చేయవచ్చునన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
వీటితో పాటు చట్టాల సంపుటిలోని పురాతన చట్టాలను తొలగించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయాసలను గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.
Many issues will be discussed today. The people of India have lot of faith in the judiciary and this is a big asset: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 24, 2016