Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముద్ర ల‌బ్దిదారుల‌తో రేపు సంభాషించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాజ‌ధానిలో రేపు జ‌రిగే ఒక కార్య‌క్ర‌మంలో పాలుపంచుకొని, దేశ‌ం లోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 కు పైగా ముద్ర (ఎమ్ యుడిఆర్ ఎ) ల‌బ్దిదారుల‌తో సంభాషించ‌నున్నారు.

పూచీక‌త్తులు లేకుండానే రుణాల‌ను సరళంగా అందించ‌డం ద్వారా యువ‌తీయువకులలో ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తి ని ప్రోత్స‌హించ‌డం కోసం ప్ర‌భుత్వం సంక‌ల్పించిన ప్ర‌ధాన కార్య‌క్ర‌మాల‌లో ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న (పిఎమ్ఎమ్‌వై) ఒక‌టి గా ఉంది. 2018 మార్చి 23వ తేదీ నాటికి 2,28,144.72 కోట్ల రూపాయ‌ల విలువైన 4,53,51,509 రుణాల‌ను మంజూరు చేయ‌డ‌మైంది. ఈ ప‌థ‌కంలో భాగంగా అందించిన నిధులు మొత్తంమీద 2,20,596.05 కోట్ల రూపాయ‌లుగా ఉన్నాయి.

కార్పొరేట్లు కానటువంటి చిన్న వ్యాపార రంగం (ఎన్‌సిఎస్‌బిఎస్‌) కు ఆర్థిక స‌దుపాయాల‌ లభ్యతకు మార్గాన్ని సుగమం చేసి ఆ కోవకు చెందిన సంస్థల వ్యాప్తిని ప్రోత్సహించడం కోసం 2015 ఏప్రిల్ 8 నాడు ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌డ‌మైంది. ఈ ప‌థ‌కంలో భాగంగా శిశు, కిశోర్ మ‌రియు త‌రుణ్ విభాగాల‌లో రుణాలను ఇట్టే సమకూర్చుతారు.

ఈ ప‌థ‌కంలో భాగంగా, ఆదాయాన్ని ఆర్జించి పెట్టే కార్య‌క‌లాపాల కోసం 10 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఉండే రుణాల‌న్నింటినీ పిఎమ్ఎమ్‌వై రుణాల రూపంలో సమకూర్చుతారు. 50,000 రూపాయ‌ల వ‌ర‌కు రుణాన్ని ‘శిశు’ అనే ఉప ప‌థ‌కం ద్వారాను, 50,000 రూపాయ‌ల నుండి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల మ‌ధ్య రుణాన్ని ‘కిశోర్’ ఉప ప‌థ‌కం ద్వారాను, మ‌రియు 5 ల‌క్ష‌ల రూపాయ‌ల నుండి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల మ‌ధ్య రుణాన్ని ‘త‌రుణ్’ ఉప ప‌థ‌కం ద్వారాను ఇస్తారు.

వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యకలాపాల (పంట రుణాలు, కాలువ‌లు, బావులు, సేద్యపు నీటి పారుద‌ల‌ వంటివి మినహా)తో పాటు వీటికి ఊతంగా నిలచే సేవ‌ల‌ను సైతం [ ఏ సేవలయితే జీవనాధారాన్ని ప్రోత్సహిస్తాయో, లేదా ఆదాయాన్ని సమకూర్చుతాయో ] వాటిని 2016 ఏప్రిల్ తరువాత నుండి ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న లో చేర్చ‌డ‌ం జరిగింది.

***