పిఎంఇండియా
మూడు ప్రధాన రహదారుల నిర్మాణానికిగాను హర్యానా రాష్ట్రం సోనెపట్ దగ్గర ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ డబ్బుతో రహదారులను నిర్మిస్తున్నామని అనుకుంటాంగానీ..నిజానికి ఆ రహదారులే డబ్బును ఆర్జిస్తాయని అన్నారు. మూడు ప్రధాన రహదారుల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన
అభివృద్ధికి కావలసిన కీలకమైన అంశాలపైన ప్రధాని మాట్లాడారు. అవి మౌలిక వసతుల ప్రాజెక్టులు, రహదారులు, విద్యుత్ శక్తియేనని అన్నారు. ఒకసారి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకున్నామంటే అభివృద్ధితోపాటు ప్రజల జీవితాలు మెరుగవుతాయనని అన్నారు. ఈ రహదారుల ద్వారా హర్యానా అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు.
మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులను అమలు చేయడంలో ఎలాంటి అడ్డంకులున్నా తొలగిస్తామని, విధివిధానాలను సరళీకరిస్తామని అందుకోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రగతి పేరు మీద వివిధ మంత్రిత్వశాఖలతోను, రాష్ట్రాలతోనూ తన అధ్యక్షతన ప్రతి నెలా జరుగుతున్న సమావేశాల గురించి ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. పెండింగు ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను ఈ సమావేశాల్లో పరిష్కరిస్తున్నామని ఆయన వివరించారు. మూడు ప్రధాన రహదారుల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన
రాబోయే వేయి రోజుల్లో పద్దెనిమిది వేల గ్రామాలకు కరెంటు సౌకర్యాన్ని కలిగించాలనే తన లక్ష్యం గురించి ప్రధాని మరోసారి స్పష్టం చేశారు. 2022 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు ఎలాంటి అంతరాయమూ లేకుండా 24 గంటలూ విద్యుత్‌ను అందిస్తామని ప్రధాని అన్నారు. మూడు ప్రధాన రహదారుల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ వీరేంద్ర సింగ్ పాల్గొన్నారు. మూడు ప్రధాన రహదారుల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన
Wherever infrastructure is good, development is possible. Quality of life improves with good infrastructure: PM https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) November 5, 2015
Good infrastructure has the potential to transform nations: PM @narendramodi in Haryana https://t.co/DiOE3xjsL7
— PMO India (@PMOIndia) November 5, 2015
There are so many districts not connected with a national highway. Bharat Mala project will change that: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 5, 2015
We have made attempts to transform the railways- increase speed, extension, expansion, better stations. Lot of initiatives are happening: PM
— PMO India (@PMOIndia) November 5, 2015
Why is it that after so many years 18,000 villages do not have electricity? Govt has decided that every village must have electricity: PM
— PMO India (@PMOIndia) November 5, 2015
Money doesn't build roads, roads brings money. My speech while laying fountain stone for highway projects in Sonepat https://t.co/EqDKFYEelt
— Narendra Modi (@narendramodi) November 5, 2015