పిఎంఇండియా
మేధోసంపత్తి (ఐ పి) రంగంలో సహకారం కోసం భారతదేశానికి, యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందం పత్రం (ఎమ్ ఒ యు) కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.ఈ ఎమ్ ఒ యు పై 7.11.2016 నాడు సంతకాలు జరిగాయి.
మేధో సంపత్తి రంగంలో స్వయం చాలక యంత్ర విధానం (ఆటోమేషన్), నూతన దస్తావేజు లేఖనం మరియు సమాచార వ్యవస్థలను అభివృద్ధిపరచడంలో సహకారాన్ని పెంపొందించడం మరియు తత్సంబంధిత సహకారాన్ని ఇనుమడింపచేయడం కోసం విస్తృత శ్రేణితో కూడిన, ఇంకా వశ్య యంత్ర రచనకు ఈ ఎమ్ ఒ యు తోడ్పడుతుంది. శిక్షణ కార్యక్రమాలలో సమన్వయానికి, నిపుణుల రాకపోకలకు, సాంకేతిక విజ్ఞాన ఆదాన ప్రదానాలకు మరియు అవుట్ రీచ్ యాక్టివిటీస్ కు ఈ ఎమ్ ఒ యు ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.
ఎమ్ ఒ యు అమలులోకి వస్తే పేటెంట్ దరఖాస్తులను పరీక్షించడానికి సంబంధించిన ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ & ట్రేడ్ మార్క్ స్ యొక్క సామర్థ్యం పెంపొందుతుంది. పర్యవసానంగా నవకల్పనపై సకారాత్మక ప్రభావం ప్రసరించగలదు.