Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మొద‌టి ప్ర‌పంచ యుద్ధం లో పోరాడిన భార‌తీయ సైనికుల కు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


మొద‌టి ప్ర‌పంచ యుద్ధం లో పోరాడిన భార‌తీయ సైనికుల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

‘‘భ‌యంకర‌మైన మొద‌టి ప్ర‌పంచ యుద్ధం స‌మాప్త‌మై నేటి కి వంద సంవ‌త్స‌రాలు గడచిపోయాయి. మనం ప్ర‌పంచ శాంతి కి పాటుప‌డ‌తామ‌ని మన యొక్క నిబ‌ద్ధ‌త ను పున‌రుద్ఘాటించుకొందాం. అలాగే సద్భావన, సౌభ్రాతృత్వం నిండిన వాతావ‌ర‌ణాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామ‌ని ప్ర‌తిన బూనుదాం; త‌ద్వారా యుద్ధాల వ‌ల్ల సంభ‌వించే మార‌ణ‌కాండ, వినాశాలు పున‌రావృత్తం కాకుండా చూడగలం.

భారతదేశం ప్ర‌థ‌మ ప్ర‌పంచ యుద్ధం లో పోరాడిన తన వీర జ‌వానుల‌ను స్మ‌రించుకొంటోంది. ఇది ఎటువంటి యుద్ధమంటే ఇందులో భారత‌దేశం ప్ర‌త్య‌క్షంగా పాల్గొన‌లేదు గాని మ‌న జ‌వానులు శాంతి కోసమని యావత్తు ప్రపంచం అంతటా పోరు స‌లిపారు.

ప్రథమ విశ్వ యుద్ధం లో భారతదేశ భూమిక జతపడినటువంటి ఫ్రాన్స్ లోని న్యువె-చాపెల్ స్మార‌కం మ‌రియు ఇజ్రాయిల్ లోని హైఫా స్మార‌కం ల వద్ద శ్ర‌ద్ధాంజ‌లి ని అర్పించే గౌర‌వం ఇదివరకు కూడా నాకు ద‌క్కింది; అది ఎప్పుడంటే ప్ర‌ధాని శ్రీ బెంజామిన్ నెత‌న్యాహూ భార‌త‌దేశానికి త‌ర‌లి వ‌చ్చిన స‌మ‌యం లో; అప్పట్లో మేం తీన్ మూర్తి- హైఫా చౌరాస్తా లో శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించాం’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.

***