Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మోర్బీ రాజమాత విజయకుంవర్‌బా మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


గుజరాత్‌లోని మోర్బీ రాజమాత విజయకుంవర్‌బా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఆమె విశిష్ట వ్యక్తిత్వం, సేవా నిరతి, మోర్బీ ప్రజలతో ఆమెకు ఉన్న ప్రేమానురాగాలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని ప్రధానమంత్రి అన్నారు. 

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని.. ఈ దుఃఖ సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పరమాత్ముడిని కోరుకుంటున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:

“మోర్బీ రాజమాత ఆదరణీయ విజయకుంవర్‌బా గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె విశిష్ట వ్యక్తిత్వం, సేవాభావం, మోర్బీ ప్రజలతో ఆమెకు ఉన్న అనుబంధం ఎప్పటికీ చిరస్మరణీయం.

సర్వేశ్వరుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని.. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఈ తీవ్ర దుఃఖాన్ని భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నాను.

ఆమెకు నా హృదయపూర్వక శ్రద్ధాంజలి.”