Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌ణిపూర్ పూర్వ ముఖ్య‌మంత్రి శ్రీ రిశాంగ్ కిశింగ్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


మ‌ణిపూర్ పూర్వ ముఖ్య‌మంత్రి, సీనియ‌ర్ రాజ‌కీయ నేత శ్రీ రిశాంగ్ కిశింగ్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు.

“శ్రీ రిశాంగ్ కిశింగ్ మృతి తో ఈశాన్య ప్రాంత రాజ‌కీయాల‌లో ఒక మహా శూన్యం ఏర్పడింది. ఆయన ఈశాన్య ప్రాంతానికి ఎంతో శ్ర‌ద్ధ‌తో సేవ‌ చేశారు.

ఈ దు:ఖదాయక ఘడియలో శ్రీ రిశాంగ్ కిశింగ్ కుటుంబ స‌భ్యులు మ‌రియు శ్రేయోభిలాషుల దుఃఖంలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

*****