పిఎంఇండియా
మరణాలపై ప్రధానమంత్రి సంతాపం
మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా పట్టణంలో రోడ్డు ప్రమాదం సంభవించి పలువురు మరణించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ‘‘మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో సంభవించిన రోడ్డు దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ సంకట సమయంలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి ప్రకటిస్తున్నాను. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.
*****