Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌ధ్య ప్ర‌దేశ్ లోని ఇండోర్ వ‌ద్ద ఉన్న పీఠంపూర్ ఎన్ఏటీఆర్ఐపీ ప్రాజెక్టుకు చెందిన ఆటో టెస్టింగ్ ట్రాక్ తాలూకు అద‌న‌పు స్థ‌లాన్ని తిరిగి ఇవ్వ‌డం


మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి దాదాపుగా 478.307 హెక్టేర్ల భూమిని తిరిగి ఇవ్వ‌డానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వహించారు. ఇందులో 461.607 హెక్టేర్లు ప్ర‌యివేటు స్థ‌లం కాగా, 16.70 హెక్టేర్లు ప్ర‌భుత్వ భూమి. దీని విలువ సుమారు రూ.740 కోట్లు.

వాపసు ల‌భించిన భూమిని రాష్ట్ర ప్ర‌భుత్వం వాహ‌న‌, వాహ‌న సంబంధిత అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల‌ కు కేటాయించ‌నుంది.

***