Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌లేసియా ప్ర‌ధానితో భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ల‌సి సంయుక్త విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా

మ‌లేసియా ప్ర‌ధానితో భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ల‌సి సంయుక్త విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా

మ‌లేసియా ప్ర‌ధానితో భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ల‌సి సంయుక్త విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా

మ‌లేసియా ప్ర‌ధానితో భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ల‌సి సంయుక్త విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా

మ‌లేసియా ప్ర‌ధానితో భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ల‌సి సంయుక్త విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా

మ‌లేసియా ప్ర‌ధానితో భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ల‌సి సంయుక్త విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా

మ‌లేసియా ప్ర‌ధానితో భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ల‌సి సంయుక్త విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా

మ‌లేసియా ప్ర‌ధానితో భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ల‌సి సంయుక్త విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా

మ‌లేసియా ప్ర‌ధానితో భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ల‌సి సంయుక్త విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా

మ‌లేసియా ప్ర‌ధానితో భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ల‌సి సంయుక్త విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా


మోదీ చేసిన ప్ర‌క‌ట‌న పాఠం

హిజ్ ఎక్స్ లెన్సీ ప్రైమ్ మినిస్ట‌ర్ శ్రీ న‌జీబ్ తున్ ర‌జాక్ జీ,

ప్ర‌చార సాధ‌నాల సభ్యుల్లారా,

ప్ర‌ధాన మంత్రి వ్య‌క్తం చేసిన సాద‌ర భావానికి, ఉత్త‌మ‌మైన ఆతిథ్యానికి

ధ‌న్య‌వాద‌ములు.

ఆసియాన్‌, తూర్పు ఆసియా శిఖ‌రాగ్ర స‌మావేశాల‌లో నిమ‌గ్న‌మై ఉండి కూడా నాకు ఆతిథ్య‌మిచ్చిన మీ స‌హృద‌య‌త‌ను ఎంత‌గానో అభినందిస్తున్నాను.

ఘ‌న‌మైన శిఖ‌రాగ్ర స‌ద‌స్సుల నిర్వ‌హ‌ణ‌, ఆసియాన్ స‌మాజం స్థాప‌న కృషికి నా అభినంద‌న‌లు అందిస్తున్నాను.

తూర్పు ఆసియా ప‌దో శిఖ‌రాగ్ర స‌ద‌స్సు త‌రుణంలో మీరు జ‌రిపిన స‌మీక్ష ఈ ప్రాంతంలోకెల్లా అత్యంత ముఖ్య‌మైన వేదిక భావి గ‌తికి ఒక చ‌క్క‌ని బాటను ప‌ర‌చ‌గ‌లిగింది.

ఒక‌దాని వెంట మ‌రొక‌టిగా జ‌రిగిన విమాన దుర్ఘ‌ట‌న‌లు ఏ దేశం ధైర్యానికైనా గండి కొట్ట‌గ‌ల‌వు. మీ నాయ‌క‌త్వ ప‌టిమ‌ను, మ‌లేసియా ప్ర‌జ‌ల దృఢ చిత్తాన్ని, సంక‌ల్ప బ‌లాన్ని నేను మెచ్చుకొంటున్నాను.

ప్ర‌ధాని ర‌జాక్ జీ, మ‌లేసియాతో మా సంబంధాల‌కు మేం ఎంతగా విలువ ఇస్తామో న‌న్ను వెల్ల‌డించ‌నివ్వండి. మ‌న సంబంధం నిల‌క‌డ అయిన పురోగ‌తి ప‌థంలో సాగుతూ ఉండ‌టానికి దోహ‌దప‌డుతున్న మీ సార‌థ్యం ప‌ట్ల మేమెంతో కృత‌ఙ్ఞుల‌మై ఉన్నాము.

ఒక‌దానితో మ‌రొక‌టి పెన‌వేసుకున్న మ‌న చ‌రిత్ర‌ల‌కు అనేక పార్శ్వాలున్నాయి. మ‌న సంస్కృతి, మ‌తం ప‌రంగా మ‌నం ఎంతో ప్రాచీన‌మైన‌వి అయిన సంబంధాల‌ను క‌లిగి ఉన్నాము. మ‌లేసియ‌న్‌- భార‌తీయ స‌మాజం మ‌న మ‌ధ్య ఎంతో ప్ర‌త్యేక‌మైన‌, ప‌టిష్ట‌మైన బంధాన్ని నిలిపి ఉంచుతోంది. వారితో గ‌త సాయంత్రం పూట క‌ల‌సి సంభాషించే అవ‌కాశం నాకు ద‌క్కింది.

మ‌న ఉనికిని వైవిధ్యం, ప్ర‌జాస్వామ్యం నిర్వ‌చిస్తున్నాయి. మ‌నం ఒక చ‌ల‌న‌శీల‌మైన ఆర్థిక భాగ‌స్వామ్యాన్ని నిర్మించుకొన్నాము. మ‌న ఇరు దేశాలు కూడా ఒకే స‌ముద్ర‌యాన మార్గంపైన నిలుస్తున్నాయి.

మ‌నం మ‌న ప్రాంతం రీత్యా ఒకే విధ‌మైన దృక్ప‌థాన్ని క‌లిగి ఉన్నాము కూడా. అంతే కాదు, ప్రాంతీయ వేదిక‌ల‌లో స‌న్నిహితంగానూ కృషి చేస్తున్నాము. ఇంత‌టి విశిష్ట‌మైన మ‌న సంబంధాల‌ను దృష్టిలో ఉంచుకొని మ‌నం మ‌న శిఖ‌రాగ్ర స‌ద‌స్సుల‌ను, మంత్రిత్వ శాఖ‌ల స్థాయి చ‌ర్చ‌ల‌ను, అధికారిక స‌మావేశాల‌ను మ‌రింత క్ర‌మం త‌ప్ప‌ని రీతిలో నిర్వ‌హించుకోవాల‌నే అంగీకారానికి వ‌చ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది.

మ‌న భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ఉన్న‌త స్థాయికి తీసుకువెళ్ల‌డానికి రెట్టించిన ఉత్సాహంతో శ్ర‌మిస్తామ‌ని నేను మీకు హామీని ఇస్తున్నాను.

మ‌రీ ముఖ్యంగా మ‌న భ‌ద్ర‌త స‌హ‌కారంలో మీరు అందిస్తున్న‌ తోడ్పాటుకు మీకెంతో కృత‌జ్ఙుడినై ఉంటాను. భ‌ద్ర‌త ప‌ర‌మైన స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డంలో మ‌న ఇరువురికీ ఒకే విధ‌మైన చిత్త‌శుద్ధి ఉన్న‌ద‌ని ఇది సూచిస్తోంది. ఈ రంగంలో మ‌నం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాన్ని ఇతోధికంగా పెంచుకుంటూ ముందుకు సాగిపోతుందాము.

ఇటీవ‌ల వివిధ దేశాల‌లో దాడులు పెచ్చుపెరుగుతున్నాయి. భార‌త్‌, అఫ్గానిస్తాన్‌ల‌లో ఎడ‌తెగ‌ని ఉగ్ర‌వాద దాడుల గురించి వేరే చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఈ దాడుల ప‌రంప‌ర ఈ విధ‌మైన ముప్పు విశ్వ వ్యాప్తం అవుతున్న‌ద‌ని గుర్తు చేస్తోంది.

ప్ర‌ధాని ర‌జాక్ జీ, ఉగ్ర‌వాదం, ప్ర‌తీప శ‌క్తుల‌తో పోరాడ‌టంలో మీరు నాయ‌క‌త్వాన్ని అందించారు. ఈ క్ర‌మంలో ఉగ్ర‌వాదం, మ‌తం.. ఈ రెంటికీ మ‌ధ్య ఎటువంటి లంకెనైనా స‌రే తిర‌స్క‌రించారు. త‌ద్వారా ఇస్లాం నిజ విలువ‌ల‌కు పెద్ద పీట వేశారు.

ఇది ఈ స‌వాలుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎదురొడ్డి నిల‌వ‌డం అనే ఒక ముఖ్య‌మైన అంశంలో క‌చ్చితంగా ఒక విశేష‌మైన కృషే అవుతుంది.

మ‌నం మ‌న ప్రాంత ప‌రిధిలో ర‌క్ష‌ణ రంగ స‌హ‌కారాన్ని.. పురోగామి స‌ముద్ర‌త‌ల భ‌ద్ర‌త‌తో పాటు విపత్తుల వేళ ప్ర‌తిస్పంద‌న‌ను ప‌టిష్ట‌ప‌రుచుకోవ‌డం స‌హా.. బ‌లోపేతంగా మ‌ల‌చుకొందాము.

మ‌న ఉభ‌య దేశాల సంయుక్త విన్యాసాల స్థాయికి మెరుగులు దిద్దుకోవ‌డానికి, అలాగే ఎస్‌యు-30 వేదిక‌ను ఏర్పాటు చేసుకోవాల‌నే అంశాల‌పై అంగీకారానికి రావ‌డం నాకు సంతోషం క‌లిగించింది.

విన్యాసాల సంక్లిష్ట‌త‌, స్థాయిల కోణంలోనూ, ఇంకా శిక్ష‌ణ‌, ర‌క్ష‌ణ రంగ ప‌రిక‌రాల విష‌యాల‌లోనూ స‌మ‌న్వ‌యాన్ని సాధించే దిశ‌గా మ‌నం ఇక‌ముందూ మ‌రింత చొర‌వ తీసుకుందాము.

సైబ‌ర్ సెక్యూరిటీ (అంత‌ర్జాల భ‌ద్ర‌త‌) రంగంలో స‌హ‌కారం ఇచ్చి పుచ్చుకోవాల‌ని మ‌నం ఒక ఒప్పందానికి రావ‌డం అతి ముఖ్య‌మైన‌ది. మ‌న జీవ‌న శైలులు ఇదివ‌ర‌క‌టి క‌న్నా ఎక్కువ‌గా మ‌మేకం అవుతున్న కొద్దీ, మ‌న కాలంలోని అత్యంత గంభీర‌మైన ఆందోళ‌న‌ల‌లో ఒక‌టిగా ఇది రూపుదాలుస్తున్న‌ది.

మ‌న ఉభ‌య దేశాల మ‌ధ్య వ్యాపారం, పెట్టుబ‌డుల సంబందాల‌ను గ‌ణ‌నీయంగా పెంపొందించుకొనేందుకు వీలు ఉన్న‌ద‌నే ప్ర‌ధాని శ్రీ ర‌జాక్ విశ్వాసంలో నేను కూడా పాలు పంచుకొంటున్నాను. మన ద్వైపాక్షిక ఒప్పందాల‌తో పాటు భార‌త‌- ఆసియాన్ ఒప్పందాల‌ను వాటి సంపూర్ణ అవ‌ధుల మేర‌కు సాకారం చేసుకోవాల‌నే ఉద్దేశంతో మన‌మున్నాము.

ప్రాంతీయ స‌మ‌గ్ర ఆర్థిక భాగ‌స్వామ్య ఒప్పందం (ఆర్‌సీఈపీఏ) త్వ‌ర‌గా ఒక ముగింపు ద‌శ‌కు చేరుకొంటుంద‌ని మన‌ము ఆశిద్దాము.

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో మ‌లేసియాకు ఉన్న స‌త్తా సుప‌రిచిత‌మే. భార‌త‌దేశంలో ర‌హ‌దారుల రంగంతో స‌హా ప‌లు ముఖ్య‌మైన ప్రాజెక్టుల‌ను మ‌లేసియా విజ‌య‌వంతంగా పూర్తి చేసింది.

మౌలిక సౌక‌ర్యాల‌ను మెరుగుప‌ర‌చ‌డం, విస్త‌రించ‌డం, మేక్ ఇన్ ఇండియా, ఆక‌ర్ష‌ణీయ న‌గరాల ప్రాజెక్టులు త‌దిత‌ర రంగాల‌లో మ‌లేసియా ప్రాతినిధ్యం ఇనుమ‌డించాల‌ని కోరుకుంటున్న‌ట్లు నేను వెల్ల‌డించాను.

మ‌లేసియాలో భార‌తీయ కంపెనీలు త‌మ ఉనికిని బ‌లంగా చాటుకున్నాయి. ఇక్క‌డ రైల్వే మౌలిక స‌దుపాయాల అభివృద్ధిలో ఇర్కాన్ త‌న వంతు పాటు ప‌డుతోంది. మ‌లేసియా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త ప్రాతినిధ్యాన్ని ఇంకా ఎక్కువ చేయాల‌ని మేం అభిల‌షిస్తున్నాం.

నిర్దిష్ట‌మైన‌, స‌త్వ‌ర ఫ‌లితాల‌ను అందించే మార్గాల‌ను అన్వేషించాల‌ని ప్ర‌ధాని, నేను కృత నిశ్చ‌యంతో ఉన్నాము. నేను అతి తొంద‌ర‌లోనే మ‌లేసియా సీఈఓల‌తోనూ భేటీ కానున్నాను.
ప్ర‌జా ప‌రిపాల‌న ప‌రంగా, ప్ర‌భుత్వ ప‌రంగా మ‌నం ఎంతో చ‌క్క‌గా స‌హ‌క‌రించుకొంటున్నందుకు, ఈ స‌హ‌కారాన్ని దృఢ‌త‌రంగా మార్చుకొంటున్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. పెమాండుతో నేను స్వ‌యంగా సంభాష‌ణ జ‌రిపాను. నీతి ఆయోగ్ వారితో క‌ల‌సి ప‌నిచేయ‌నుండ‌డం నాకు ఆనందం క‌లిగిస్తోంది.

సాంస్కృతిక సంబంధాలు, ప్ర‌జా సంబంధాలను వ‌ర్ధిల్ల‌జేసుకోవాల‌న్న అంశానికి మ‌నం ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇద్దాం.

బ్రిక్స్ ఫీల్డ్ లో లిటిల్ ఇండియా ప్ర‌వేశం వ‌ద్ద తోర‌ణ‌ గేట్‌ను ప్ర‌ధాని శ్రీ న‌జీబ్ ర‌జాక్‌, నేను క‌ల‌సి ప్రారంభించ‌నున్నామ‌న్న సంగ‌తి మీకు తెలుసు. ఇది భారత్‌కు ఒక కానుక‌. అదే స‌మ‌యంలో ఇది ప్ర‌ధాని శ్రీ న‌జీబ్ ర‌జాక్ ప్ర‌యాస ఫ‌లితం కూడా. అంతే కాకుండా, ఇది మా ఇరు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య నెల‌కొన్న మైత్రికి, కాలాతీత‌మైన బంధానికి ఒక ప్ర‌తీక‌.

భార‌త్‌కు వ‌చ్చి విద్యార్జ‌న చేయాల్సిందిగా మ‌లేసియా విద్యార్థుల‌ను నేను ఆహ్వానిస్తున్నాను. రెండు దేశాల‌కు చెందిన ప‌ట్టాల‌ను ప‌ర‌స్ప‌రం గుర్తించే ఒప్పందం త్వ‌ర‌గా ఒక కొలిక్కి రావాల‌ని కూడా నేను కోరుతున్నాను.

సిద్ధ, ఆయుర్వేద ప‌ద్ధ‌తులు స‌హా సంప్ర‌దాయ వైద్య రంగంలో మా మ‌ధ్య చ‌క్క‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు వ‌ర్ధిల్లుతున్న స‌హ‌కారం ప‌ట్ల నేనెంతో సంతోషిస్తున్నాను.

ప్ర‌ధాన మంత్రి శ్రీ ర‌జాక్, ఎంతో నిర్మాణాత్మ‌కమైన‌ చ‌ర్చకు తావిచ్చినందుకు మీకు ధ‌న్య‌వాద‌ములు. మ‌న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం మ‌రొక నూత‌న స్థాయికి ఎదుగుతుంద‌న్న న‌మ్మ‌కం నాకుంది. త్వ‌ర‌లోనే మీరు ఇండియాకు వ‌స్తార‌ని ఎదురుచూస్తుంటాను.

మీకివే నా కృత‌జ్ఞ‌తాబివంద‌న‌ములు.