Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మ‌హారాష్ట్ర‌లో బ‌స్సు ప్ర‌మాదమృతుల‌కు నివాళుల‌ర్పించిన ప్ర‌ధాని


మ‌హారాష్ట్ర‌లోని రాయగ‌ఢ్ జిల్లాలో జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళుల‌ర్పించారు.

“మహారాష్ట్ర‌లోని రాయ‌గ‌ఢ జిల్లాలో జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌డం ప‌ట్ల ఎంతో బాధ‌ప‌డుతున్నాను. త‌మ ప్రియ‌మైన వారిని కోల్పోయిన వారికి నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను” అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సంతాప సందేశంలో తెలిపారు.

***