Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యునైటెడ్ కింగ్‌డ‌మ్ ప్ర‌ధాని శ్రీ బోరిస్ జాన్‌ స‌న్ కు మ‌రియు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి మ‌ధ్య టెలిఫోన్ ద్వారా జ‌రిగిన సంభాష‌ణ‌


 
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో యునైటెడ్ కింగ్‌డ‌మ్ ప్ర‌ధాని శ్రీ బోరిస్ జాన్‌ స‌న్ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.

ఇండియా-యుకె స్ట్ర‌టీజిక్ పార్ట్‌న‌ర్‌శిప్ ను నూత‌న ద‌శాబ్ది లో మ‌రింత గా బ‌లోపేతం చేసుకోవాల‌న్న అభిలాష ను ఉభ‌య నేత‌ లు ఈ సంద‌ర్భం లో వ్య‌క్తం చేశారు.  ఈ ల‌క్ష్యాన్ని సాధించే దిశ గా ఒక స‌మ‌గ్ర‌మైన మార్గ‌సూచీ ని రూపొందించుకోవ‌డం ఉప‌యోగ‌క‌రంగా ఉంటుందని వారు అంగీక‌రించారు.

జ‌ల వాయు ప‌రివ‌ర్త‌న రంగం లో, ప్ర‌త్యేకించి ‘కొయలిశ‌న్ ఫ‌ర్ డిజాస్ట‌ర్ రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్’  (సిడిఆర్ఐ)కి సంబంధించినంత వ‌ర‌కు యుకె కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య గల స‌హ‌కారం ప‌ట్ల నేత‌ లు సంతృప్తి ని వెలిబుచ్చారు.  ఈ సంవ‌త్స‌రం లో గ్లాస్ గో లో జ‌రిగే సిఒపి-26కు ఆహ్వానించినందుకు గాను ప్ర‌ధాని శ్రీ జాన్‌ స‌న్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ధ‌న్య‌వాదాలు ప‌లికారు.

సిఒవిఐడి-19 మహామారి ప‌ట్ల ఇరువురు ప్ర‌ధానులు వారి యొక్క ఆలోచ‌న‌ల ను వ్యక్తం చేసుకొన్నారు.  యుకె ఆరోగ్య మంత్రి నదీన్  డోరిజ్ క‌రోనా వైర‌స్ బారిన పడటం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ఆందోళ‌న ను వ్య‌క్తం చేస్తూ, ఆమె తిరిగి శీఘ్రం గా స్వస్థురాలు కావాల‌ని ఆకాంక్షించారు.

శ్రీ జాన్ స‌న్ ను వీలయినంత త్వరలో భార‌త‌దేశాన్ని సంద‌ర్శ‌ించేందుకు త‌ర‌లి రావలసింది గా ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ త‌న ఆహ్వానాన్ని పునరుద్ఘాటించారు.