పిఎంఇండియా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిశన్ (యుపిఎస్ సి) కి, సివిల్ సర్వీస్ కౌన్సిల్ ఆఫ్ మంగోలియా (సిఎస్ సిఎమ్) కు మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రాని కి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
సిఎస్ సిఎమ్ కు మరియు యుపిఎస్ సి కి మధ్య ఇప్పటికే ఉన్న సంబంధాన్ని ఈ ఎంఒయు బలోపేతం చేయనుంది. ఇది నియామక రంగం లో ఇరు పక్షాలు వాటి అనుభవాన్ని, ప్రావీణ్యాన్ని పరస్పరం పంచుకొనేందుకు మార్గాన్ని సుగమం చేయగలదు.
*****