Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుపి లో గల నోయెడా లో సాంసంగ్ మొబైల్ త‌యారీ సదుపాయం యొక్క ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

యుపి లో గల నోయెడా లో సాంసంగ్ మొబైల్ త‌యారీ సదుపాయం యొక్క ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

యుపి లో గల నోయెడా లో సాంసంగ్ మొబైల్ త‌యారీ సదుపాయం యొక్క ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

యుపి లో గల నోయెడా లో సాంసంగ్ మొబైల్ త‌యారీ సదుపాయం యొక్క ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


అధ్య‌క్షుల వారు మరియు నా మిత్రులు శ్రీ‌మాన్ మూన్ జెయి-ఇన్ గారు; సాంసంగ్ వైస్ చైర్ మన్ శ్రీ జే వై. లీ గారు; కొరియా కు చెందిన ప్ర‌తినిధులు మ‌రియు భార‌త‌దేశానికి చెందిన ప్ర‌తినిధులు, ఇంకా ఇక్క‌డ‌కు విచ్చేైసినటువంటి ఉన్న‌తాధికారులారా,

నా స్నేహితులు ప్రెసిండెంట్ శ్రీ మూన్ గారితో క‌ల‌సి నోయెడా లో గల ఈ యొక్క సాంసంగ్ క‌ర్మాగారానికి త‌ర‌లి రావ‌డం నాకు అమిత సంతోష‌క‌ర‌మైనటువంటి అనుభూతి ని ఇచ్చింది.  ఈ యొక్క నూత‌నమైన మొబైల్ త‌యారీ విభాగం ఇటు నోయెడాకు, అటు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు కూడా గ‌ర్వకారకమైన అంశం.  ఈ కొత్త విభాగానికిగాను సాంసంగ్ ను మ‌రియు వారి యొక్క యావ‌త్ జ‌ట్టు ను నేను అభినందిస్తూ, మ‌రి వారికి నా యొక్క శుభాకాంక్ష‌ల‌ను తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

భార‌త‌దేశాన్ని త‌యారీ కి ఒక ప్ర‌పంచ కేంద్రం గా రూపుదిద్దే దిశ‌ గా ఈ నాటి సందర్భం ఎంతో ముఖ్య‌మైనది.  ఈ యొక్క 5,000 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి భార‌త‌దేశం లో సాంసంగ్ యొక్క వ్యాపార సంబంధాల‌ను ప‌టిష్ట‌ ప‌ర‌చ‌డ‌ంతో పాటు భార‌త‌దేశానికి మ‌రియు కొరియా కు మ‌ధ్య గ‌ల సంబంధాల‌లో చాలా ముఖ్య‌మైన‌టువంటిది కూడాను.  సాంసంగ్ యొక్క ప్ర‌పంచ ఆర్ & డి కేంద్రం భార‌త‌దేశం లోనే ఉంది.  మరి ఇప్పుడు, ఇదుగో ఈ యొక్క త‌యారీ క‌ర్మాగారం మ‌న అతిశ‌యాన్ని పెంపొందించనుంది.

మిత్రులారా,

వ్యాపార సముదాయానికి చెందిన వారితో నేను మాట్లాడిన‌పుడ‌ల్లా భార‌త‌దేశం లో క‌నీసం ఒక‌టైనా కొరియా కు చెందిన వ‌స్తువు అంటూ లేన‌టువంటి మ‌ధ్య‌త‌ర‌గ‌తి గృహమంటూ ఉండ‌డం చాలా అరుద‌నే విష‌యాన్ని వారితో నేను త‌రచు గా చెబుతూ ఉంటాను.  భార‌తీయుల జీవితాల‌లో సాంసంగ్ త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌ర‌చుకొంద‌నేది ఖాయం.  ప్ర‌త్యేకించి మీ యొక్క ఫోన్ లు.. అవి శ‌ర‌వేగంగా వ‌ర్ధిల్లుతున్న‌ స్మార్ట్ ఫోన్ విపణి లో ప్ర‌పంచానికే నాయ‌క‌త్వాన్ని వ‌హిస్తున్నాయి.  సాంసంగ్ నాయ‌క‌త్వంతో నేను సంభాషించిన సంద‌ర్భాల‌లో, భార‌త‌దేశం లో త‌యారీ ని చేప‌ట్ట‌వ‌ల‌సిందిగా వారిని ప్రోత్స‌హిస్తూ వ‌చ్చాను.  నోయెడా లో ఈ రోజున జ‌రుగుతున్న‌ ఈ కార్య‌క్ర‌మం ఆ చొర‌వ యొక్క ప్ర‌తిబింబ‌మే.  ఒక సామాన్య మాన‌వుడి జీవితాన్ని స‌ర‌ళ‌త‌రంగా మార్చివేయ‌డంలో డిజిట‌ల్ సాంకేతిక విజ్ఞానం ప్ర‌స్తుతం ఒక ప్ర‌ముఖ పాత్ర‌ను పోషిస్తోంది.  వ‌ర్త‌మానం లో సుమారు 40 కోట్ల స్మార్ట్ ఫోన్ లు భార‌త‌దేశం లో ఉప‌యోగంలో ఉన్నాయి.  మ‌రి 32 కోట్ల మంది ప్ర‌జ‌లు బ్రాడ్ బ్యాండ్ ను వినియోగిస్తున్నారు.  ఇంట‌ర్ నెట్ ఆధారితమైన స‌మాచార రాశి అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కు ల‌భ్యం అవుతోంది.  అలాగే,  దేశం లోని ఒక ల‌క్ష‌ కు పైగా గ్రామ పంచాయ‌తీలు ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్ ప‌రిధి లోకి చేరుకొన్నాయి.  ఈ విష‌యాల‌న్నీ కూడాను దేశంలో ఒక డిజిట‌ల్ విప్ల‌వం చోటు చేసుకొంటోంద‌ని సూచిస్తున్న‌ాయి.

మిత్రులారా,

ప్ర‌స్తుతం త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తున్న మొబైల్ ఫోన్ లు, శీఘ్రగతితో కూడినటువంటి ఇంట‌ర్ నెట్, ఇంకా త‌క్కువ ఖ‌ర్చు లో అందుబాటు లోకి వ‌స్తున్న ఇంట‌ర్ నెట్ ఆధారిత స‌మాచార రాశి.. ఇవ‌న్నీ త్వరిత గ‌తి తో కూడిన మ‌రియు పార‌ద‌ర్శ‌క‌మైన సేవ‌ల అంద‌జేతకు పూచీ ప‌డుతున్నాయి.  దాదాపు అన్ని ర‌కాల సౌక‌ర్యాలు.. అవి విద్యుత్తు బిల్లుల మ‌రియు నీటి బిల్లుల చెల్లింపు కావ‌చ్చు; లేదా పాఠ‌శాలలు మ‌రియు క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశం కావ‌చ్చు; లేదా భ‌విష్య నిధి; లేదా పెన్ష‌న్ కావ‌చ్చు.. ఆన్‌లైన్ లో అందుబాటులో ఉన్నాయి.  దేశ‌వ్యాప్తంగా విస్త‌రించిన‌టువంటి 3 ల‌క్ష‌ల‌కు పైగా కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ లు గ్రామ ప్రాంతాల వారికి సేవ‌ల‌ను అందిస్తున్నాయి.  కాగా, న‌గ‌రాల‌లో ఉచిత వై-ఫై హాట్ స్పాట్ లు పేద యువత యొక్క మ‌రియు మ‌ధ్య‌త‌ర‌గ‌తి కి చెందిన యువ‌తీయువ‌కుల యొక్క ఆకాంక్ష‌ల‌కు రెక్క‌లు తొడుగుతున్నాయి. 

ఇది మాత్ర‌మే కాదు, గ‌వ‌ర్న‌మెంట్ ఇ-మార్కెట్ ప్లేస్.. జిఇఎమ్‌ (GeM) ద్వారా ఉత్ప‌త్తిదారుల వ‌ద్ద నుండి స‌రుకుల‌ను ప్ర‌భుత్వం నేరుగా కొనుగోలు చేస్తోంది.  ఇది చిన్న న‌వ పారిశ్రామికుల‌కు మ‌రియు మ‌ధ్య‌త‌ర‌హా న‌వ పారిశ్రామికుల‌కు లాభ‌దాయ‌కంగా ఉంది.   ఇది ప్ర‌భుత్వ కొనుగోలు విధానంలో పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని కూడా పెంచింది.

మిత్రులారా,

ప్ర‌స్తుతం డిజిట‌ల్ లావాదేవీలు అదే ప‌నిగా పెరుగూతూ పోతున్నాయి.  భీమ్ యాప్ (BHIM App), ఇంకా రూపే కార్డు ల వ‌ల్ల లావాదేవీ జ‌ర‌ప‌డం ఎంతో సులువైపోయింది.  జూన్ మాసం లో సుమారు 41,000 కోట్ల రూపాయ‌ల విలువైన లావాదేవీలను భీమ్ యాప్ ద్వారా జ‌ర‌ప‌డ‌మైంది.  ఇవాళ భార‌త‌దేశం లో మాత్ర‌మే కాక ప్ర‌పంచం అంత‌టా కూడాను భీమ్ ఇంకా రూపే ల‌ను గురించిన కుతూహ‌లం నెల‌కొంది.  ఈ రెండు స‌దుపాయాల‌ను కొద్ది రోజుల కింద‌ట సింగ‌పూర్ లో ప్రారంభించే అవ‌కాశం నాకు ద‌క్కింది.  అటువంటి ప‌రిస్థితిలో ఈ రోజు జ‌రుగుతున్న‌టువంటి కార్య‌క్ర‌మం భార‌తీయ పౌరుల సశక్తీకరణకు తోడ్పాటును అందించ‌డం మాత్ర‌మే కాకుండా ఇది మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మానికి ఒక వేగగతిని కూడా స‌మ‌కూర్చ‌గ‌లుగుతుంది.

మిత్రులారా,

మేక్ ఇన్ ఇండియా కోసం మేము ప‌ట్టుప‌ట్ట‌డం ఆర్థిక విధానం లో ఓ భాగం మాత్ర‌మే కాదు, ఇది కొరియా వంటి మా మిత్ర దేశాల‌తో మా యొక్క సంబంధాల ప‌ట్ల మేము క‌న‌బ‌రుస్తున్న ఒక వ‌చ‌న బ‌ద్ధ‌త కూడాను.  సాంసంగ్ వంటి ఒక విశ్వ‌స‌నీయ‌మైన బ్రాండు కు న‌వీన అవ‌కాశాల‌ను స‌మ‌కూర్చ‌డంతో పాటు ఇది ఒక ‘న్యూ ఇండియా’ తాలూకు నూత‌నమైనటువంటి మ‌రియు పార‌ద‌ర్శ‌క‌మైన‌టువంటి వ్యాపార సంస్కృతి యొక్క ప్ర‌యోజ‌నాన్ని పొందాల‌ని భావించే ప్ర‌పంచం లోని ప్ర‌తి ఒక్క వ్యాపారికి బ‌హిరంగ ఆహ్వానం కూడాను.  భార‌త‌దేశం లోని వ‌ర్ధిల్లుతున్న‌టువంటి ఆర్థిక వ్య‌వ‌స్థ, అంత‌కంత‌కు విస్తృత‌ం అవుతున్న‌ న‌వ్య మ‌ధ్య‌త‌ర‌గ‌తి.. ఇవి పెట్టుబ‌డి కి అసంఖ్యాక అవ‌కాశాల‌ను కల్పిస్తున్నాయి.  మ‌రి ఈ కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌డ‌ంతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా దీనిని స్వాగ‌తిస్తున్నందుకు కూడా నేను సంతోషిస్తున్నాను.  మొబైల్ ఫోన్ త‌యారీని గురించి మ‌నం మాట్లాడుకొన్న ప‌క్షంలో, భార‌త‌దేశం ప్ర‌స్తుతం ఈ విష‌యం లో రెండో అతిపెద్ద త‌యారీదారుగా వుంది.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో మొబైల్ త‌యారీ యూనిట్ల సంఖ్య అంత‌కు పూర్వం నాలుగేళ్ళ‌ లో 2గా ఉన్న‌ది కాస్తా 120 కి పెరిగింది.  వాటిలో 50 యూనిట్ లు ఒక్క నోయెడా లోనే నెల‌కొన‌డం సంతృప్తిని ఇచ్చేట‌టువంటి విష‌యం.  ఈ యూనిట్ లు 4 ల‌క్ష‌ల మందికి పైగా యువ‌జ‌నుల‌కు ప్ర‌త్య‌క్ష ఉపాధిని క‌ల్పించాయి.  ఉద్యోగ క‌ల్ప‌న‌లో సాంసంగ్ ఒక ముఖ్య పాత్ర‌ను పోషించింది.  మీరు యావ‌ద్దేశం లో దాదాపు 70,000 మంది ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌క్ష ఉపాధిని క‌ల్పించారు.  మ‌రి వారిలో సుమారు 5 వేల మంది ఇక్క‌డ- నోయెడా లో- ఉపాధి ని పొందారు.  ఈ యొక్క క‌ర్మాగారం లో 1,000 మంది ఉద్యోగాలు సంపాదించుకోనున్నారు.  ఇక్క‌డ ఏర్పాటు చేసిన ఈ యూనిట్ మీ కంపెనీ యొక్క అతి పెద్ద మొబైల్ ఫోన్ త‌యారీ యూనిట్ కాబోతోంద‌నే సంగ‌తి నా దృష్టి కి వచ్చింది.  ప్ర‌తి నెలా ఇక్క‌డ దాదాపు ఒక కోటి ఫోన్ లను త‌యారు చేయబోతున్నారు.  ఈ కర్మాగారం లో మొత్తం ఉత్ప‌త్తి లో 30 శాతం ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేయ‌బోతున్నారు.  వాటిని ప్ర‌పంచం లోని వివిధ దేశాల‌కు ఎగుమ‌తి చేస్తారు.  ఇది ప్ర‌పంచ విప‌ణి లో మీ యొక్క స్థానాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డం త‌థ్యం.  దీనికి అర్థం మ‌నం కొరియా కు చెందిన సాంకేతిక విజ్ఞానంతో పాటు భార‌త‌దేశానికి చెందిన త‌యారీ, ఇంకా సాఫ్ట్ వేర్ అండ‌దండ‌ల‌తో ప్ర‌పంచ విప‌ణి కోసం శ్రేష్ఠ‌త‌ర‌మైన ఉత్ప‌త్తుల‌ను రూపొందిస్తామన్న మాట.  మ‌రి మన రెండు దేశాల యొక్క శ‌క్తి, అలాగే మ‌న యొక్క ఉమ్మ‌డి దార్శ‌నిక‌త సైతం ఇదే.

సాంసంగ్ యొక్క యావ‌త్తు బృందానికి మ‌రొక్క‌మారు నేను అభిన‌ందనల‌ను, శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నాను.  ఈ రోజు న‌న్ను ఇక్క‌డకు పిలిచి, ఈ సంద‌ర్భంలో న‌న్ను ఒక భాగ‌స్తుడిగా చేసిన మీకు అంద‌రికీ అనేకానేక ధ‌న్య‌వాదాలు.
 

**