Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యువజన మరియు క్రీడా వ్యవహారాల రంగంలో భారత దేశం బ్రూనై దారుస్సలామ్ ల మధ్య ఎమ్ ఒ యు కేంద్ర మంత్రి మండలి దృష్టికి..


యువజన మరియు క్రీడా వ్యవహారాల రంగంలో భారత దేశం బ్రూనై దారుస్సలామ్ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు) గురించి ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ ఎమ్ ఒ యు పై బ్రూనై లోని బందర్ సెరి బెగవాన్ లో 2016, ఫిబ్రవరి 2న సంతకాలు జరిగాయి.

రెండు దేశాల మధ్య యువజన వ్యవహారాలు మరియు క్రీడల రంగాలలో మార్పిడి కార్యక్రమాలు అధికారులు మరియు శిక్షణార్థుల శిక్షణ కోసం నిర్వహించే కార్యక్రమాలు, క్రీడా సదుపాయాలు, క్రీడా సామాగ్రి, క్రీడా శిక్షణ మరియు శారీరకంగా సన్నద్ధులను చేయడం,స్పోర్ట్స్ ఫిట్నెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ లకు సంబంధించి రెండు దేశాల పక్షాన పాలుపంచుకొనే వారిలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం.. ద్వైపాక్షిక సహకారంలో భాగంగా ఉంటాయి. అంతే కాకుండా కోచింగ్, క్రీడా ప్రతిభను గుర్తించడం, క్రీడల నిర్వహణ మరియు పరిపాలన, యువత మరియు క్రీడలకు సంబంధించిన సమాచార వ్యవస్థ, క్రీడలలో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం వంటివి కూడా రెండు దేశాల మధ్య సహకారంలో భాగంగా ఉంటాయి.