Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యువజన వ్యవహారాలలో భారతదేశం-రష్యాల మధ్య సహకారం కోసం ఉద్దేశించిన అవగాహన పూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


యువజన వ్యవహారాలలో భారతదేశం – రష్యాల మధ్య సహకారం కోసం ఉద్దేశించిన అవగాహన పూర్వక ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశం, రష్యా ల మధ్య యువజన వ్యవహారాల రంగంలో చోటు చేసుకొనే మార్పిడి కార్యక్రమాలు రెండు దేశాల యువతీ యువకులలో సంస్కృతి, ఆదర్శాలు, విలువల ఆదాన ప్రదానానికి ఊతం ఇవ్వగలవు. రెండు దేశాల ప్రజల మధ్య పటిష్టమైన సంబంధాలను నెలకొల్పడంతో పాటు స్నేహపూర్వక సంబంధాలను సుదృఢం చేయగలవు.

మార్పిడి కార్యక్రమాలలో పాల్గొనే వారిని ఎంపిక చేయడానికి తటస్థమైన, పారదర్శకమైన విధానాన్నిఅనుసరించనున్నారు. ఎమ్ ఒ యు లో భాగంగా చేపట్టే కార్యక్రమాల ఫలితాలను ప్రజా పరిశీలనకు అనుమతిస్తారు.

రెండు దేశాల మధ్య జరిగే మార్పిడి కార్యక్రమాలు యువతరంలో అంతర్జాతీయ దృక్పథాన్నిపెంచి పోషించడంలో, యువజన వ్యవహారాల రంగంలో వారి అవగాహనను, ప్రావీణ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని ఆశిస్తున్నారు.

***