పిఎంఇండియా
భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొజాంబిక్ ను సందర్శించిన సందర్భంగా క్రీడలు, యువజన వ్యవహారాల రంగంలో సహకారం అంశంపై భారతదేశం మరియు మెజాంబిక్ ల మధ్య 2016 జూలై 7 వ తేదీన ఒక అవగాహక పూర్వక ఒప్పంద పత్రం (ఎం ఒ యు) పైనా సంతకాలు జరిగిన అంశాన్ని కేంద్ర మంత్రిమండలి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ ఎం ఒ యు రెండు దేశాల మధ్య క్రీడల ప్రోత్సాహానికి దోహదం చేయడంతో పాటు యువతలో ఆలోచనలు, విలువలు మరియు సంస్కృతికి సంబంధించిన అంశాలను ప్రోత్సహించడం, ఇంకా స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడంలో సహాయపడనున్నది.
అంతే కాకుండా, యువతీయువకులలో అంతర్జాతీయ దృష్టి కోణాన్ని మెరుగుపరచడంలోను, క్రీడలు మరియు యువజన వ్యవహారాల్లో వారికి ఉన్న జ్ఞానాన్ని, ప్రావీణ్యతను విస్తరించడంలోను కూడా తోడ్పడనుంది.