పిఎంఇండియా
యువజనుల వ్యవహారాల పై సహకారం అంశం లో భారతదేశం మరియు మొరాకో ల మధ్య 2019వ సంవత్సరం ఫిబ్రవరి లో సంతకాలైన ఒక అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎంఒయు) గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకురావడమైంది.
యువజన వ్యవహారాల లో ఉభయ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రోత్సహించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. వివిధ కార్యక్రమాల లో రెండు దేశాల యువత పాల్గొనడం, సమాచారాన్ని, జ్ఞానాన్ని ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకోవడం, రెండు దేశాల యువత అవతలి దేశం లో పర్యటించడం వంటివి ఇందులో భాగం గా ఉన్నాయి.
యువజనుల కు సంబంధించిన సహకారం విషయం లో గల అంశాలు కింది విధం గా ఉన్నాయి..:
యువజనులకు ఉద్దేశించి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం,
అంతర్జాతీయ సదస్సు లు, చర్చాసభల కు సంబంధించిన ఆహ్వానాల ను పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం
ముద్రిత సామగ్రి, చలనచిత్రాలు, యువత అనుభవాలను వెల్లడి చేసుకోవడం, పరిశోధన,ఇతర సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం
యువజన శిబిరాల లోను, యువజన ఉత్సవాలలోను పాలుపంచుకోవడం, ఇంకా పరస్పర సహకారం తో నిర్వహించే కార్యక్రమాల లో పాల్గొనడం.
ఉభయ దేశాలూ 2019వ సంవత్సరం మొదలుకొని ప్రతి ఏటా 20 మంది సభ్యుల తో కూడిన ప్రతినిధివర్గాలను పది రోజుల కు మించకుండా రెండు దేశాలలోనూ పర్యటించేటట్టు చూడాలని ఈ ఎంఒయు లో పొందుపరచడమైంది.