Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యువ‌త, క్రీడా సంబంధిత అంశాలలో సహకారం కోసం ఇండోనేషియా, కిర్గిజ్ రిప‌బ్లిక్ ల‌కు, భార‌త‌దేశానికి మ‌ధ్య‌ జ‌రిగిన ఎమ్ ఒయు లు మంత్రివర్గం పరిశీలనకు నివేదన


ఇండొనేషియాతో భార‌త‌దేశానికి, కిర్గిజ్ రిప‌బ్లిక్ తో భారతదేశానికి మ‌ధ్య‌ కుదిరిన అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద ప‌త్రాల (ఎమ్ఒయు ల) ను గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకురావడమైంది.

ఈ ఒప్పందాల్లోని అంశాలు ఇలా ఉన్నాయి:

1. యువ‌జ‌న‌, క్రీడా సంబంధమైన అంశాలలో భార‌త‌దేశానికి ఇండోనేషియాకు మ‌ధ్య‌ అవ‌గాహ‌న ఒప్పందం కుదిరింది.

2. యువ‌జ‌నాభివృద్ధి రంగంలో భార‌త‌దేశానికి, కిర్గిజ్ రిప‌బ్లిక్‌కు మ‌ధ్య‌ అవ‌గాహ‌న ఒప్పందం కుదిరింది.

ఇండోనేషియా, కిర్గిజ్ రిప‌బ్లిక్ ల‌తో యూత్ ఎక్స్చేంజ్ కార్య‌క్ర‌మాలు, ఇంకా యువ‌జ‌నుల‌కు, క్రీడల‌కు సంబంధించిన అంశాలలో ఈ దేశాలకు, భార‌త‌దేశానికి మ‌ధ్య‌ స‌హ‌కారం కోసం ఉద్దేశించిన‌వే ఈ ఎమ్ఒయు లు.

ఇంటర్ నేషనల్ యూత్ ఎక్చేంజ్ కార్య‌క్ర‌మాల‌ ద్వారా ప‌లు ఆలోచ‌న‌లను ఆయా దేశాలు ప‌ర‌స్ప‌రం ఇచ్చి పుచ్చుకోవ‌డం జ‌రుగుతుంది. అంతే కాదు.. దీనివల్ల విలువ‌లు, సంస్కృతి తదిత‌ర అంశాలలో యువ‌త‌లో అవ‌గాహ‌న పెర‌గ‌డ‌మే కాకుండా వారిలో అంతర్జాతీయ దృక్ప‌థం అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ కారణంగా ఆయా దేశాల మ‌ధ్య శాంతి, అవ‌గాహ‌నలు ఏర్ప‌డ‌తాయి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. యువ‌జ‌నులకు, క్రీడ‌ల‌కు సంబంధించిన అంశాలలో స‌హ‌కరించుకోవడంతో యువ‌జనాభివృద్ధికి, భాగ‌స్వామ్య దేశాలలో క్రీడ‌ల‌కు ప్రోత్సాహం లభించగలదు.

ద్వైపాక్షిక ఆదాన ప్రదాన కార్య‌క్ర‌మాల‌ ద్వారా భాగ‌స్వామ్య దేశాలలోని యువ‌త‌కు వారి కులం, మ‌తం, స్త్రీ- పురుష భేదంతో సంబంధం లేకుండా ల‌బ్ధి చేకూరుతుంది.

ఇందుకు సంబంధించిన యూత్ ఎక్స్చేంజ్, ఇంకా ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ కోసం చేసే యువ‌త ఎంపిక ఎలాంటి వివ‌క్ష‌కు తావు లేకుండా పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతుంది. ఈ కార్య‌క్ర‌మాల‌ ద్వారా చేకూరే ఫ‌లితాల‌ను సాధార‌ణ ప్ర‌జ‌లు ఎవ‌రైనా స‌రే నేరుగా తెలుసుకోవ‌చ్చు.

యూత్ ఎక్స్చేంజ్‌, ఇంకా ఇత‌ర కార్య‌క్ర‌మాలు యువ‌త‌లో అంత‌ర్జాతీయ దృక్ప‌థాన్ని వృద్ధి చేయ‌డ‌మే కాకుండా వారి విజ్ఙానాన్ని, నైపుణ్యాల‌ను అధికం చేస్తాయి కూడా.

***