Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యు కె నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి థెరెసా మే ను అభినందించిన ప్రధాన మంత్రి; భారత దేశం- యు కె సంబంధాలను బలోపేతం చేయడంలో శ్రీ డేవిడ్ కేమ్ రన్ కృషికి ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు.


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్ డమ్ నూతన ప్రధానిగా పదవీబాధ్యతలను స్వీకరించిన శ్రీమతి థెరెసా మే కు అభినందనలు తెలిపారు. భారత దేశం- యుకె సంబంధాలను బలోపేతం చేయడంలో శ్రీ డేవిడ్ కేమ్ రన్ చేసిన కృషిని కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.

“యుకె నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి థెరెసా మే కు ఇవే నా అభినందనలు. భారత దేశం- యు కె సంబంధాలు దృఢతరం కావడం కోసం ఆమెతో కలసి పని చేయాలని నేను ఎదురుచూస్తున్నాను.

భారతదేశం- యు కె సంబంధాలను పటిష్ట పరచడంలో శ్రీ డేవిడ్ కేమ్ రన్ చొప్పుకోదగిన విధంగా కృషి చేశారు. అందుకు ఆయనను కూడా నేను అభినందిస్తున్నాను” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.