Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యూఏఈపై జరిగిన దాడిని ఖండిస్తూ.. శాంతి, ప్రాంతీయ స్థిరత్వానికి మద్దతును పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి


యూఏఈపై జరిగిన దాడులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారుఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు.

పౌరులనుప్రజా మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు.

యూఏఈకి సంఘీభావంగా భారత్ దృఢంగా నిలబడుతుందనీచర్చలుదౌత్యం ద్వారా అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకొనేందుకు తను మద్దతును పునరుద్ఘాటిస్తుందనీ శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ప్రాంతీయంగా శాంతినిస్థిరత్వాన్నిఅంతర్జాతీయ ఇంధన భద్రతను కొనసాగించేందుకు హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షితమైననిరాటంకమైన నౌకాయానానికి భరోసా ఇవ్వడమే కీలకమని స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పోస్టు చేశారు:

‘‘యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాంఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడ్డారుపౌరులనుమౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు.

యూఏఈకి సంఘీభావంగా భారత్ దృఢంగా నిలబడుతుందిచర్చలుదౌత్యం ద్వారా అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకొనేందుకు తన మద్దతును పునరుద్ఘాటిస్తోంది.

ప్రాంతీయంగా శాంతినిస్థిరత్వాన్నిఅంతర్జాతీయ ఇంధన భద్రతను కొనసాగించేందుకు హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షితమైననిరాటంకమైన నౌకాయానానికి భరోసా ఇవ్వడం కీలకం’’

 

***