Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యూఏఈ అధ్యక్షునితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. పశ్చిమ ఆసియాలో వర్తమాన స్థితి గురించి చర్చ


యూఏఈ అధ్యక్షుడు శ్రీ షేక్ మొహమద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడి, ఈద్ కు ముందస్తు శుభాకాంక్షల్ని తెలియజేశారు. ప్రధానమంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు పశ్చిమ ఆసియాలో వర్తమాన స్థితిని గురించి కూడా ఈ సందర్భంగా చర్చించారు. యూఏఈ లో అమాయక ప్రజల ప్రాణాలను హరించిన, పౌర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించిన అన్ని దాడుల్నీ భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రధాని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం సురక్షితంగా, నిరంతరాయంగా కొనసాగేటట్లు చూడడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందేనని విషయాన్ని ప్రధానమంత్రితో పాటు అధ్యక్షుడు కూడా అంగీకరించారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించేందుకు రెండు దేశాలు కలసి నిరంతరం కృషి చేస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘నా సోదరుడు యూఏఈ అధ్యక్షుడు శ్రీ షేక్ మొహమద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడి, ఈద్ ‌కు ముందస్తు శుభాకాంక్షల్ని తెలియజేశాను.
 పశ్చిమ ఆసియాలో వర్తమాన స్థితిని గురించి కూడా మేం చర్చించాం. యూఏఈ లో అమాయక ప్రజల ప్రాణాలను హరించిన, పౌర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించిన అన్ని దాడుల్నీ భారత్ తీవ్రంగా ఖండిస్తోందని నేను పునరుద్ఘాటించాను.
హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం సురక్షితంగానూ, నిరంతరాయంగానూ కొనసాగేటట్లు చూడడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందేనని మేం అంగీకరించాం.
ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలతో పాటు స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించేందుకు మేం కలసి పనిచేస్తుంటాం’’ అని పేర్కొన్నారు.